Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: గ్యాంగ్ స్టర్ కాదు.. మాన్స్టర్!

By:  Tupaki Desk   |   5 Dec 2018 4:00 PM GMT
ట్రైలర్ టాక్: గ్యాంగ్ స్టర్ కాదు.. మాన్స్టర్!
X
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'కె.జీ.ఎఫ్'. ఈ సినిమా మొదటి ట్రైలర్ తోనే సంచలనం సృష్టించింది. మంచి పొటెన్షియల్ ఉన్న సినిమాగా అన్ని భాషల ఆడియెన్స్ చేత మెప్పు పొందింది. తాజాగా 'కె.జీ.ఎఫ్' టీమ్ రెండో ట్రైలర్ ను విడుదల చేశారు. మొదటి ట్రైలర్లో కోలార్ గోల్డ్ మైన్స్ ఇంట్రో ఇచ్చిన మేకర్స్ ఈ సినిమాలో హీరో యష్ క్యారెక్టర్ ఇంట్రో మీద దృష్టి పెట్టారు.

ట్రైలర్ ఓపెనింగ్ లోనే అనారోగ్యంగా ఉన్న యష్ అమ్మ "నాకొక మాటివ్వు.. నువ్వెలా బతుకుతావో నాకు తెలియదు.. కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజులాగా.. శ్రీమంతుడి లాగా చచ్చిపోవాలి" అంటుంది. పసివయసులో ఉన్న యాష్ అలాగేనని అమ్మకు మాటిస్తాడు. అందరూ పవర్ పవర్ అంటుంటే.. ఆ చిన్న బాబు "పవర్ ఎక్కడ దొరుకుతుంది?" అంటాడు. 70 లలో అమెరికా.. రష్యా కోల్డ్ వార్ మూలంగా బంగారం ధర విపరీతంగా పెరిగిందని.. కె.జీ.ఎఫ్ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ గోల్డ్ మైన్ అని చూపించారు. ఇక రఫ్ గా.. రగ్డ్ గా ఉండే యాష్ ఎంట్రీ. కోట్లాటల్లో శత్రువులను నరుకుతూ.. గన్లు పేలుస్తూ డాన్ లా కనిపించాడు. "కొట్లాటలలో ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు. ముందు ఎవడు కింద పడిపోయాడన్నదే లెక్కలోకొస్తుంది."అంటాడు. ఫైనల్ డైలాగ్.. అతనంత పెద్ద గ్యాంగ్ స్టరా? అని ఎవరో అడిగితే... 'గ్యాంగ్ తో వచ్చే వాడు గ్యాంగ్ స్టర్.. కానీ అతనొక్కడే వస్తాడు.. మాన్స్టర్' మరొకరు అంటారు. ఇంతకంటే హీరోయిజం ఎలివేషన్ ఇంకేముంటుంది చెప్పండి?

ఫస్ట్ ట్రైలర్లో ఉన్నట్టే సినిమాటోగ్రఫీ.. మ్యూజిక్ అనీ సూపర్ గా ఉన్నాయి. ఫుల్ ట్రైలర్ లో ఒక రా ఫీల్ ఉంది. యష్ ను చూస్తే నిజంగానే మాన్స్టర్ లాగానే ఉన్నాడు. ఇది డెఫినిట్ గా చూడాల్సిన సినిమానే. డిసెంబర్ 21 న రిలీజ్ కాబోయే మిగతా సినిమాలకు గట్టి పోటీనే. మరి అంతలోపు ట్రైలర్ పై ఒక లుక్కేయండి.