Begin typing your search above and press return to search.
ట్రైలర్: 'కేజీఎఫ్' ఫస్ట్ బ్లడ్!
By: Tupaki Desk | 9 Nov 2018 10:26 AM GMTపీరియడ్ డ్రామాలు - సీక్వెల్ సినిమాల హవా సాగుతున్న సందర్భమిది. ఆ బాటలోనే కన్నడ హీరో యశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా `కేజీఎఫ్`. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరంగదుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఏ ఫిలింస్ - ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా పెట్టుబడుల్ని సమకూర్చాయి. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కన్నడ - తెలుగు - తమిళం - హిందీలో ఈ చిత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. డిసెంబర్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది.
తాజాగా `కేజీఎఫ్- చాప్టర్ 1` ట్రైలర్ లాంచ్ అయ్యింది. అన్ని భాషలకు సంబంధించి విడివిడిగా ట్రైలర్లను లాంచ్ చేశారు. తెలుగు వెర్షన్ ట్రైలర్ ఇంప్రెస్సివ్. ఈ సినిమా చారిత్రక నేపథ్యం.. కథానాయకుడి రూపం.. మనసుపై ఘాడమైన ముద్ర వేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. లోతైన సంభాషణలు ఈ ట్రైలర్‌కి బిగ్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. అసలు కేజీఎఫ్ కథేంటి? అంటే .. 1970 కాలంలో కర్నాటక కోలార్ బంగారు గనుల్లో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ కథతో ముంబైకి ఉన్న లింకేంటి? అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. చరిత్ర పాఠాల్లో బానిస ప్రపంచానికి సంబంధించి రకరకాల కథలున్నాయి. అలాంటి కథల్లో ఇదీ ఒకటి అని అర్థమవుతోంది. బంగారు గనుల్లో పని చేసేవారి బానిసత్వ బతుకుల్ని బాగు చేసేందుకు ఎక్కడి నుంచో వచ్చే మొరటోడిగా యశ్ కనిపిస్తున్నాడు. బయటి ప్రపంచంతో సంబంధం లేని ఒక కొత్త ప్రపంచంలోకి సిల్వస్టర్ స్టాలోన్ లా ఎంట్రీ ఇస్తున్నాడు యశ్. అక్కడ సెటప్ మొత్తం `ఫస్ట్ బ్లడ్` యాంబియెన్స్ ని తలపించింది. ఆ గనులు ఉన్న ప్రదేశానికి అతడికి ఉన్న లింక్ అంతే ఆసక్తి రేకెత్తించేదే. కథానాయకుడు ముంబై నుంచి ఓ డీల్ విషయమై వస్తాడు. అయితే ఆ జర్నీలో తన మూలాల్ని వెతుక్కుంటూ తిరిగి తన సొంత ప్రదేశానికే వస్తాడని అర్థమవుతోంది.
తొలినుంచి ప్రచారం చేస్తున్నట్టే కేజీఎఫ్ రెగ్యులర్ సినిమా కాదు. ఇది అంతకుమించి!! అని ట్రైలర్ చెబుతోంది. అద్భుతమైన ఛాయాగ్రహణం.. రీరికార్డింగ్.. 70ల నాటి వాతావరణాన్ని ఎలివేట్ చేసే ఆర్ట్ వర్క్ .. నభూతోనభవిష్యతి అన్న తీరుగా ఉంది. కేజీఎఫ్ ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. వేల మంది నీ వెనక ఉంటే యుద్ధాన్ని గెలుస్తావ్.. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో వేల మంది ఉంటే ప్రపంచాన్నే జయిస్తావు! లాంటి ఘాడమైన సంభాషణలతో మనసును తాకింది ఈ ట్రైలర్. గుబురైన గడ్డం .. గిరజాల జుత్తుతో రగ్గుడ్ గా యశ్ మాస్ లుక్ ఆకట్టుకుంది. దేనినైనా లెక్కచేయని ఎవరినైనా ఎదురించే వీరుడిగా అతడు కనిపిస్తున్నాడు. బంగార గనుల్లో పని చేసే బానిస సంకెళ్లను తెంచే వీరుడిగా అతడు కనిపించబోతున్నాడు. చాప్టర్ 1అని వేశారు కాబట్టి దీనిని ఎన్ని చాప్టర్లుగా రిలీజ్ చేస్తారు? అన్నది ఇప్పటికి సస్పెన్స్. యశ్ - శ్రీనిధి శెట్టి తదితరులు నటిస్తున్నారు. రవి భాస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
తమిళ్ ట్రైలర్ కోసం క్లిక్ చేయండి