Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ వర్సెస్ ‘కాంతారా’.. ఆ రికార్డుకు అడుగు దూరం..!
By: Tupaki Desk | 25 Oct 2022 12:30 PM GMTకన్నడ ‘కాంతారా’ మూవీ విడుదలై 25 రోజులు గడుస్తున్నా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల అయిన ‘కాంతారా’ కర్ణాటక, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ లతోపాటు ఓవర్సీస్ లోనూ దూసుకెళుతోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ‘కాంతారా’ ప్రేక్షకులను ఎంతగానో మెస్మరైజ్ చేస్తుంది.
ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఆయన పెట్టిన దానికి ఇప్పటికే పదింతలు డబ్బులు వచ్చేశాయి. హిందీలో ఈ సినిమాను పెద్దగా ప్రమోషన్ చేయక పోయినప్పటికీ మౌత్ టాక్ తోనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఈ సినిమాకు వీకెండ్లోనే కాకుండా మిగతా రోజుల్లోనూ కలెక్షన్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.
దీపావళి పండుగను పురస్కరించుకొని పలు కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయినప్పటికీ ‘కాంతారా’ హవా మాత్రం తగ్గడం లేదు. ‘కాంతారా’కు సైతం దీపావళి సెలవులు కలిసి రావడంతో ఈ మూవీ కన్నడ ఇండస్ట్రీలోని అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ‘కేజీఎఫ్-1’ రికార్డులను త్వరలో బ్రేక్ చేసేలా కన్పిస్తోంది.
కేజీఎఫ్-1 మూవీ ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా అన్ని వెర్షన్లు కలుపుకొని 200 కోట్ల గ్రాస్ ను అధిగమించింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళం, హిందీలో భారీగా కలెక్షన్లు వస్తుండటంతో ‘కాంతారా’ కేజీఎఫ్-1ను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
కాకపోతే ‘కేజీఎఫ్-2’ రికార్డును మాత్రం బ్రేక్ చేసే అవకాశం కన్పించింది. ఈ మూవీ అన్ని వెర్షన్లు కలుపుకొని దాదాపు వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. దీంతో ‘కాంతారా’ మూవీ ‘కేజీఎఫ్-1’ కంటే అత్యధికంగా.. ‘కేజీఎఫ్-2’ కంటే తక్కువ కలెక్షన్లతో సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశం కన్పిస్తోంది. కాగా ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిన దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టిపై ప్రతీఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.