Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ రాఖీ రీనా కనిపించడం లేదేం గురూ!
By: Tupaki Desk | 24 Jun 2022 2:30 AM GMTకేజీఎఫ్ సినిమా తో దర్శకుడు ప్రశాంత్ నీల్.. హీరో యశ్ మరియు హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఒక కన్నడ మూవీ వంద కోట్ల వసూళ్లు రాబట్టడం గగనం అనుకుంటున్న సమయంలో ఏకంగా వెయ్యి కోట్లు దాటి దాదాపుగా 1300 కోట్ల వసూళ్ల వరకు కేజీఎఫ్ సాధించింది. కన్నడంలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా కేజీఎఫ్ అద్బుతమైన రికార్డులను నమోదు చేసింది.
ఇప్పటికి కూడా కేజీఎఫ్ 2 అక్కడక్కడ థియేట్రికల్ స్క్రీనింగ్ అవుతోంది. ఒక వైపు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. కేజీఎఫ్ రెండు పార్ట్ లు కూడా అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ ఫుల్ బిజీ గా ఉండి ఉంటారని కొందరు భావిస్తున్నారు. కాని ఇప్పటి వరకు కేజీఎఫ్ స్టార్స్ తదుపరి సినిమాలకు సైన్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే సలార్ సినిమా ను చేస్తున్నాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ తో ఒక సినిమాను చేయబోతున్నాడు. మరో వైపు వరుసగా ప్రాజెక్ట్ లను కూడా ఆయన కమిట్ అవుతున్నాడు. ఇలాంటి సమయంలో కేజీఎఫ్ స్టార్స్ అయిన యశ్ మరియు శ్రీనిధి ఇప్పటి వరకు ఒక్క సినిమ కు కూడా సైన్ చేయక పోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
హీరో యశ్ అంటే కాస్త ఆలస్యంగా చేసినా పర్వాలేదు కాని హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది అంటూ విమర్శలు వస్తున్నాయి. శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ పొగరును తలకెక్కించుకుని స్క్రిప్ట్ విషయంలో తన పాత్ర విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్లే ఆఫర్లు రావడం లేదు అని గుసగుసలు కూడా కన్నడ మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి.
కన్నడంలో ఆమె చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లు లేదని.. ఇతర భాషలు అయిన తమిళం.. తెలుగు లేదా హిందీ లో సినిమాలు చేయాలని.. తద్వారా భారీ పారితోషికం వస్తుందని ఆశిస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొత్తానికి కేజీఎఫ్ హీరో రాఖీ భాయ్ మరియు హీరోయిన్ రీనా ల తదుపరి సినిమాలు ఏంటీ అనే విషయమై కేజీఎఫ్ విడుదల సమయంలో జరిగిన చర్చ స్థాయిలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.