Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ 2 : యూఎస్ లో తెలుగు ప్రేక్షకుల క్లీయర్ కట్ డామినేషన్
By: Tupaki Desk | 6 April 2022 10:01 AM GMTకన్నడంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 ను దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈనెల 14న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా యూఎస్ వసూళ్లు కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు కేజీఎఫ్ 2 కోసం భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. ప్రీమియర్ షో లతో పాటు రెగ్యులర్ షో ల కోసం యూఎస్ లో పెద్ద మొత్తంలో అడ్వాన్స్ బుకింగ్ జరుగగా అందులో మెజార్టీ వాటా తెలుగు ప్రేక్షకుల నుండి కావడం విశేషం.
యూఎస్ లో ఈ సినిమాను కన్నడంతో పాటు హిందీ.. తెలుగు.. తమిళం మరియు మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారు. అన్ని భాషలకు చెందిన అడ్వాన్స్ బుకింగ్ లను ప్రారంభించారు. అక్కడ మెజార్టీ స్థాయిలో అంటే ఏకంగా 85 శాతం అడ్వాన్స్ బుకింగ్ తెలుగు వర్షన్ కు అయ్యింది. కేవలం 15 శాతం బుకింగ్ కన్నడం మరియు ఇతర భాషల ప్రేక్షకులు చేసుకున్నారు.
కన్నడ సినిమా అయినా కూడా కేజీఎఫ్ 2 కు మంచి ఆధరణ యూఎస్ లో ఉంది. అయితే అది తెలుగు ప్రేక్షకుల నుండి అవ్వడం విడ్డూరంగా ఉందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో కేజీఎఫ్ 2 సినిమా చూడాలని భావిస్తున్న వంద మంది లో 85 మంది మన తెలుగు వారే ఉండటం చూస్తుంటే తెలుగు ప్రేక్షకులు యూఎస్ లో ఏ స్థాయిలో డామినేషన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల తెలుగు ప్రేక్షకులు యూఎస్ లో రాధేశ్యామ్ మరియు ఆర్ ఆర్ ఆర్ లను చూశారు. ముఖ్యంగా జక్కన్న మూవీ ఆర్ ఆర్ ఆర్ ను యూఎస్ లోని తెలుగు ప్రేక్షకులు ఓ రేంజ్ లో చూశారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు అయ్యాయి. నెల గ్యాప్ కూడా లేకుండా రాబోతున్న కేజీఎఫ్ ను కూడా తెలుగు ప్రేక్షకులు యూఎస్ లో చూసేందుకు పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ ను చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది.
యూఎస్ లో అన్ని భాషలకు చెందిన వారు ఉన్నారు. కాని తెలుగు ప్రేక్షకులు సినిమా అంటే ఎంతటి అభిమానం ఉందో కేజీఎఫ్ 2 కు నమోదు అవుతున్న అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లను చూస్తుంటే అర్థం అవుతుంది. కన్నడం లో రూపొందిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ కు ఈ స్థాయిలో వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటే కాస్త పాజిటివ్ టాక్ ను దక్కించుకుంటే ఖచ్చితంగా రికార్డు లు నమోదు చేయడం ఖాయం అంటున్నారు.
కేవలం యూఎస్ లో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా కేజీఎఫ్ 2 సినిమా కుమ్మేయబోతుంది. కాస్త సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కర్ణాటకలో ఏ స్థాయిలో అయితే వసూళ్లు దక్కించుకుంటుందో ఇక్కడ అంతకు మించిన వసూళ్లు దక్కించుకునే అవకాశాలు లేకపోలేదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాదిన కూడా కేజీఎఫ్ 2 సినిమా కు భారీగా వసూళ్లు నమోదు అవ్వబోతున్నాయి.
ఉత్తర భారతంలోని పలు ముఖ్య పట్టణాల్లో తెలుగు వర్షన్ కోసం అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది. మొత్తానికి తెలుగు ప్రేక్షకులు అక్కడ ఇక్కడ క్లీయర్ కట్ డామినేషన్ ను కేజీఎఫ్ 2 వసూళ్ల పై చూపించబోతున్నట్లుగా ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. కేజీఎఫ్ 1 సూపర్ హిట్ అయిన కారణంగా కేజీఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.