Begin typing your search above and press return to search.
'కేజీయఫ్ 2' ఒక చెత్త సినిమా..!
By: Tupaki Desk | 14 April 2022 12:30 PM GMTదక్షిణాది చాలా ఏళ్ల తరువాత తన సత్తాని భారతీయ సినీ వినీలాకాశంలో సగర్వంగా చాటుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే భారతీయ సినిమా అంటే తామే అంటూ ముందు వరుసలో నిలిచే బాలీవుడ్ వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. 'బాహుబలి' నుంచి ఈ వాతావరణం మొదలైంది. ఇటీవల విడుదలైన ట్రిపుల్ ఆర్ తో ఇది పీక్స్ కు చేరింది. అంతే కాకుండా తాజాగా విడుదలైన 'కేజీఎఫ్ చాప్టర్ 2' కూడా ఇదే పంథాని కొనసాగిస్తూ బాలీవుడ్ వర్గాల్లో అభద్రతాభావాన్ని కలిగిస్తోంది.
దీంతో కొంత మంది దక్షిణాది చిత్రాలు విడుదలైన వెంటనే వాటిపై సోషల్ మీడియా వేదికగా విచురుకుపడుతున్నారు. చెత్త సినిమాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ క్రిటిక్ ని అంటూ చెప్పుకునే కె ఆర్కే యష్ నటించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2'పై విరుచుకుపడ్డాడు. ఇదొక చెత్త సినిమా అంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేజీఎఫ్ చాప్టర్ 1 కు కొనసాగింపుగా రూపొందిన చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 2'.
దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు, యష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్ట్ 1 సంచలనాలు సృష్టించడంతో పార్ట్ 2 పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ కోసం యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
నాలుగేళ్ల విరామం అనంతరం ఈ మూవీ ఏప్రిల్ 14న ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
'ట్రిపుల్ ఆర్' రిలీజ్ సమయంలో ఈ మూవీ చెత్తగా వుందని, ఇలాంటి చెత్త సినిమాని తీసిన దర్శకు రాజమౌళిని జైలులో పెట్టాలంటూ వివిదాస్పదంగా స్పందించాడు. తాజాగా 'కేజీఎఫ్ చాప్టర్ 2'పై కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడంతో ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
'కేజీఎఫ్ 2 సినిమా 30 నిమిషాల పాటు ఏం జరుగుతోందో అస్సలు అర్థం కాదని, దిమాక్ ఖరాబ్ అయిందని, ట్రిపుల్ ఆర్ కంటే కేజీఎఫ్ 2 పదింతలు చెత్త సినిమా అని సంచలన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతని ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే అతని ట్వీట్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్ కెఆర్కేని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.