Begin typing your search above and press return to search.
'కేజీఎఫ్ 2' - 'మాస్టర్' ఎఫెక్ట్: 'మహేష్ డైరెక్టర్స్' ని ట్రోల్ చేస్తున్న డైహార్డ్ ఫ్యాన్స్..!
By: Tupaki Desk | 9 Jan 2021 2:30 AM GMTకేజీఎఫ్ 2' టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయని తెలుస్తోంది. అలానే మరో ఐదు రోజుల్లో రిలీజ్ కానున్న 'మాస్టర్' సినిమా కూడా ప్రమోషనల్ కార్యక్రమాలతో సందడి చేస్తోంది. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కూడా హీరోయిజం సీన్స్ చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల వల్ల సూపర్ మహేష్ బాబుతో వర్క్ చేసిన డైరెక్టర్స్ ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు 'పోకిరి' సినిమా తర్వాత అలాంటి సినిమాలు చేయడం లేదని డై హార్డ్ ఫ్యాన్స్ నుంచి కంప్లైంట్ ఉంది. వరుసగా సూపర్ హిట్స్ ఇస్తున్నప్పటికీ కంప్లీట్ మాస్ సినిమా చేయడం లేదని.. కంటెంట్ బేస్డ్ సినిమాలు అంటూ ఒకే తరహా క్యారెక్టర్స్ చేస్తున్నాడని వాళ్ళు ప్రతిరోజూ ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు 'మాస్టర్' 'కేజీఎఫ్ 2' హడావిడి మొదలయ్యాక.. మహేష్ తో ఈ మధ్య వర్క్ చేసిన దర్శకులు ఎవరూ ఈ రేంజ్ లో సూపర్ స్టార్ ని చూపంచలేదని వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' 'బ్రహ్మోత్సవం' సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల - 'మహర్షి' సినిమా తీసిన వంశీ పైడిపల్లి ని బాగా ట్రోల్ చేస్తున్నారు. మీరు ఆ సినిమాలు తీసిన తర్వాత మహేష్ ఫ్యామిలీ మెసేజ్ అంటూ అలాంటి రోల్స్ కే స్టక్ అయిపోయాడని సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. కాలేజ్ నేపథ్యం తీసుకుని లోకేష్ 'మాస్టర్' లాంటి సినిమా తీస్తే.. పైడిపల్లి మాత్రం సక్సెస్ జర్నీ అంటూ 'మహర్షి' సినిమా తీసాడని అంటున్నారు. ఇదే క్రమంలో మహేష్ కి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల శివను సైతం ట్రోల్ చేస్తున్నారు. ఆ సినిమాల తర్వాతే మహేష్ ఇలా మరిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. మెసేజ్ లు ఇయ్యాలంటే వాట్సాప్ చేస్తే సరిపోతుందని.. సినిమాగా మాత్రం తీయొద్దని ట్వీట్స్ పెడుతున్నారు.
అయితే మహేష్ లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'తో ఆ లోటు తీరుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ క్యారక్టరైజేషన్.. మేనరిజం నెవర్ బిఫోర్ అనే విధంగా ఉండబోతోందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ లో ఫుల్ హెయిర్.. చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మహేష్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. మరి సూపర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆశించే సినిమా 'సర్కారు వారి పాట' అవుతుందేమో చూడాలి.