Begin typing your search above and press return to search.
కేజీఎఫ్- చాప్టర్ 2 కొత్త రిలీజ్ తేదీ ఇదే
By: Tupaki Desk | 22 Jan 2021 3:30 AM GMTకేజీఎఫ్ చాప్టర్ 1 సంచలన విజయం సాధించడంతో సీక్వెల్ పైనే అందరి దృష్టి. అంచనాలకు తగ్గట్టే ప్రశాంత్ నీల్ నుంచి పార్ట్ 2 రాబోతోందని ఇటీవల టీజర్ చెప్పకనే చెప్పింది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ టీజర్ తో హీట్ పెంచారు.
చాప్టర్ 2 టీజర్ రిలీజైన 24 గంటల్లోనే వైరల్ గా దూసుకెళ్లింది. దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అయితే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడడంతో కొత్త విడుదల తేదీ పై ఇప్పటివరకూ క్లారిటీ లేదు.
తాజా సమాచారం మేరకు.. రిలీజ్ తేదీని లాక్ చేశారని తెలిసింది. కేజీఎఫ్ చాప్టర్ 2 మే 30 న అన్ని భారతీయ భాషలలో తెరపైకి వస్తుందని తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ తేదీ విషయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న పంపిణీదారులందరికీ మేకర్స్ తెలియజేశారట.
ఇప్పటికే బిజినెస్ పరంగానూ స్పీడ్ గానే ఉన్నారట. కేజీఎఫ్ 1 ని రిలీజ్ చేసిన సాయి కొర్రపాటి కేజీఎఫ్ చాప్టర్ 2ని కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలలో థియేటర్ హక్కులు ప్రస్తుతం అమ్ముడయ్యాయి. అతను తెలుగు జిల్లాల హక్కుల కోసం భారీ ధరలను కోట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
కెజిఎఫ్: చాప్టర్ 2 లో యష్- శ్రీనిధి శెట్టి- సంజయ్ దత్ - రవీనా టాండన్- ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి సంబంధించిన రిలీజ్ తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారని తెలిసింది.