Begin typing your search above and press return to search.
ఐఎండిబి 2022 టాప్ 10లో KGF2 - RRR
By: Tupaki Desk | 14 July 2022 4:31 AM GMTపాపులర్ వెబ్ IMDB లో చోటు దక్కితే ఆ సినిమాకి ఉండే క్రేజ్ వేరు. ఐఎండీబీ అంటే అర్థం- ఇంటర్నెట్ మూవీ డేటాబేస్. 2022 ప్రథమార్ధంలో టాప్ 10 అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలనచిత్రాలు .. వెబ్ సిరీస్ ల జాబితాను తాజాగా ఐఎండీబీ విడుదల చేసింది. వివేక్ అగ్నిహోత్రి 'ది కాశ్మీర్ ఫైల్స్'... MX ప్లేయర్ వెబ్ సిరీస్ 'క్యాంపస్ డైరీస్' జాబితాలో అగ్ర స్థానాన్ని అలంకరించాయి.
2022 ఉత్తమ సినిమాల జాబితాలో 'ది కాశ్మీర్ ఫైల్స్' ఈ సంవత్సరం ఆశ్చర్యకరంగా టాప్ పొజిషన్ కైవశం చేసుకుంది. దక్షిణాది నుండి ఎపిక్ పీరియాడికల్ డ్రామాలు యష్ నటించిన K.G.F: చాప్టర్ 2... S.S.రాజమౌళి RRR చిత్రాలు రెండు మూడు స్థానాల్ని అలంకరించాయి.
కమల్ హాసన్- విజయ్ సేతుపతి - ఫాహద్ ఫాసిల్ నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'తో అలియా భట్ 'గంగూబాయి కతియావాడి' నాల్గవ స్థానాన్ని పంచుకుంది.
అమితాబ్ బచ్చన్ నే'ఝుండ్'... అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్'.. అజయ్ దేవగన్ దర్శకత్వం వహించిన 'రన్ వే 34'.. యామీ గౌతమ్ - నేహా ధూపియా ప్రధాన పాత్రల్లో నటించిన డిస్నీ+ హాట్ స్టార్ చిత్రం 'ఏ థర్స్ డే'.. మలయాళం రొమాంటిక్ డ్రామా ప్రణవ్ మోహన్‌లాల్ నటించిన 'హృదయం' టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
ఆయా సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు.. ఇతర గణాంక నమూనాలు ..న విమర్శకుల నుండి వచ్చిన సమీక్షలు..ర్యాంకింగ్ ల ఆధారంగా కాకుండా IMDB భారతదేశంలోని IMDB వినియోగదారుల పేజీ వీక్షణలపై IMDBPro డేటాను తీసుకుంటుంది.
వెబ్ సిరీస్ లలో 'క్యాంపస్ డైరీస్' తర్వాత తిగ్మాన్షు ధూలియా 'ది గ్రేట్ ఇండియన్ మర్డర్' టాప్ 1 టాప్ 2లో ఉన్నాయి. వికాస్ స్వరూప్ అత్యధికంగా అమ్ముడైన నవల 'సిక్స్ సస్పెక్ట్స్' ఆధారంగా రూపొందిన సిరీస్ ది గ్రేట్ ఇండియన్ మర్డర్. భారతదేశ అంతరిక్ష మార్గదర్శకులు హోమీ జె. భాభా... విక్రమ్ సారాభాయ్ ల కథను తెలిపే 'రాకెట్ బాయ్స్' జాబితాలో 3వ స్థానంలో ఉంది. పంచాయత్-హ్యూమన్-యే కాళీ కాళీ అంఖీన్-అఫరాన్-ఎస్కేప్ లైవ్-మై-ది ఫేమ్ గేమ్ కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి.