Begin typing your search above and press return to search.
రోజుకు 10కోట్లతో KGF2 భీభత్సం.. బాహుబలి 2 రికార్డుల్ని టచ్ చేస్తాడా?
By: Tupaki Desk | 4 May 2022 5:38 AM GMTగ్యాంగ్ స్టర్ డ్రామాలు వర్కవుటైతే.. మాస్ ని రిపీటెడ్ గా థియేటర్లకు రప్పించగలిగితే అలాంటి సినిమాలకు ఎలాంటి ఆదరణ దక్కుతుందో ఇప్పటికే ఇండస్ట్రీలన్నీ చూశాయి. ముఖ్యంగా ఉత్తరాది ఊర మాస్ కి కిక్కు పుట్టించే సినిమా తీస్తే ఎలా ఉంటుందో హిందీ బెల్ట్ లో కేజీఎఫ్ 2 కి దక్కుతున్న వసూళ్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తొలివారం మలివారం అయిపోయింది. మూడో వారంలోనూ కేజీఎఫ్ 2 పోటీబరిలో ఎందరు ఉన్నా రోజుకు 8-10 కోట్లు వసూలు చేస్తోందంటే అర్థం చేసుకోవాలి. ఈ ఈద్ కి ఏకంగా 8.50 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం.
kGF చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద 20 వ రోజు ఇలాంటి ప్రదర్శన చేయడం ఇప్పటికీ థియేటర్లు కిటకిటలాడడం ఆశ్చర్యపరుస్తోంది. యష్ నటించిన చిత్రం ఈద్ హాలిడేని ఉత్తమంగా ఉపయోగించుకుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా మూడవ వారంలో ఉన్నప్పటికీ ఈద్ రోజున బాక్సాఫీస్ వద్ద ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంచనాల ప్రకారం.. ఈ చిత్రం సోమవారం కంటే 100 శాతం గ్రోత్ చూపించి రూ. 8.25 నుంచి 8.60 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు.
దంగల్ హిందీ వెర్షన్ మొత్తం కలెక్షన్లను అధిగమించి హిందీ బెల్ట్ లో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. సింగిల్ స్క్రీన్ లు లేదా మల్టీప్లెక్స్‌లు అయినా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు KGF - చాప్టర్ 2 మొదటి ఎంపికగా మారింది. ఇది బసి ఈద్ కారణంగా బుధవారం కూడా స్థిరంగా ఉంటుందని అంచనా. త్వరలో 400 కోట్ల క్లబ్ లో చేరనుంది.
దీంతో KGF 2 థియేట్రికల్ మాన్ స్టర్ అని నిరూపితమైంది. హిందీ బెల్ట్ లలో త్వరలో కలెక్షన్లకు బ్రేక్ పడేట్టు కనిపించడం లేదని ప్రముఖ అనలిస్టులు చెబుతున్నారు. ఈ చిత్రం హిందీ బెల్ట్ లలోని ఎగ్జిబిటర్ లకు అదిరిపోయే ఈదీ ట్రీట్ ని అందించింది. ఎందుకంటే ఇది బాలీవుడ్ లో రెండు ఈద్ విడుదలలు - రన్ వే 34 -హీరోపంతి 2లకు నో షో అనేలా చేసింది. KGF 2 మూడవ వారం కలెక్షన్లు ఆల్ టైమ్ అత్యధికంగా ఉన్నాయని అంచనా.
యష్ సినిమా హిందీ బెల్ట్ లో సెన్సేషనల్ విజయం అందుకుంది. ఈ సినిమా రోజుకు స్థిరంగా 8కోట్లు వసూలు చేసినా.. మరో రెండు వారాల్లోనే బాహుబలి 2 రికార్డును అందుకునే ఛాన్సుంటుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే దంగల్ 380కోట్ల రికార్డును బ్రేక్ చేసి 400 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంచనా వేసారు. మరో రెండు వారాలు ఇదే తీరుగా ఆడితే గనుక బాహుబలి 2 దగ్గరకు చేరుతుంది.
కానీ ఇది అంత సులువైన ఫీట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈనెల 6 నుంచి థియేటర్లలోకి హాలీవుడ్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ వచ్చేస్తోంది. దీనివల్ల మల్టీప్లెక్స్ ఆడియెన్ డివైడ్ అవుతారని భావిస్తున్నారు. అయినా కేజీఎఫ్ 2 క్రేజ్ చెక్కు చెదరదని ఇతర సినిమాలకు పంచ్ పడుతుందని కూడా అంచనా వేస్తున్నారు.
ఓవరాల్ గా యష్ మాన్ స్టర్ అని నిరూపించాడు. అతడి ముందు దేవగన్ లు టైగర్ లు నిలబడలేరని ఈసారికి ప్రూవ్ అయ్యింది. హీరోయిజాన్ని పీక్స్ లో చూపించగలిగితే ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో కేజీఎఫ్ 2 నిరూపించిందని సంజయ్ దత్ సహా కరణ్ జోహార్ - తరణ్ ఆదర్శ్ వంటి ప్రముఖులు విశ్లేషించారు.