Begin typing your search above and press return to search.
టీజర్ విడుదల తర్వాత కేజీఎఫ్ 2 విలువ రెట్టింపు
By: Tupaki Desk | 26 Jan 2021 3:30 AM GMTయశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న కేజీఎఫ్ 2 సినిమా కోసం యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కించాడో అంతకు పది రెట్ల భారీ హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషన్ సీన్స్ ను కూడా కేజీఎఫ్ 2 లో చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. రికార్డు స్థాయి బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. కేజీఎఫ్ 2 సినిమా వసూళ్ల విషయంలో ఇప్పటికే జనాల్లో ఒక స్పష్టత వచ్చేసింది. ఖచ్చితంగా ఇది ఆల్ ఇండియా రికార్డులను టచ్ చేయడం ఖాయం అంటున్నారు. ముఖ్యంగా టీజర్ విడుదల తర్వాత సినిమా రేంజ్ మరింతగా పెరిగింది.
టీజర్ విడుదలకు ముందు సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు విడుదల తర్వాత ఫ్రీ రిలీజ్ లెక్కలు మొత్తం తారు మారు అయ్యాయి. ఒక్క తెలుగులోనే టీజర్ విడుదల తర్వాత కేజీఎఫ్ 2 డబ్బింగ్ రైట్స్ ధర ఏకంగా రూ.25 కోట్లకు పైగా పెరిగినట్లుగా టాక్ వినిపిస్తుంది. అంతకు ముందు 50 కోట్లకు అటు ఇటుగా ఉంటే ఇప్పుడు 75 కోట్ల వరకు చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ తో పాటు అన్ని భాషల డబ్బింగ్ రైట్స్ కూడా ముందు అనుకున్నట్లుగా కాకుండా పెరిగినట్లుగా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం డబ్బింగ్ రైట్స్ మరియు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కు సంబంధించిన లావాదేవీలు చర్చలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు అనుకున్న అమౌంట్ కు దాదాపుగా డబుల్ అమౌంట్ ను నిర్మాతలు తమ ఖాతాలో వేసుకునే అవకాశం కనిపిస్తుందని.. సినిమా సక్సెస్ అయితే ఆ మొత్తం మరింత ఎక్కువ అవ్వడం కూడా ఖాయం అంటున్నారు.