Begin typing your search above and press return to search.
చిరు దంచాడు.. బాలయ్య ఉతికాడు
By: Tupaki Desk | 15 Jan 2017 3:33 PM GMTఇద్దరు లెజెండ్స్ అరుదైన మైలురాయిలను అందుకున్నారు. సంక్రాంతి సమరానికి దిగిన మెగాస్టార్ చిరంజీవి.. నటసింహా బాలకృష్ణ యుఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేసేస్తూ మైల్ స్టోన్స్ దాటేశారు. చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఆదివారం నాడు 2 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టగా.. బాలయ్య చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మిలియన్ మార్కును దాటేసింది.
దాదాపు పదేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి పునరాగమనం చేసిన చిరు నేరుగా 2 మిలియన్ క్లబ్బును టచ్ చేయడం ద్వారా తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో రుజువు చేశాడు. చిరు సినిమా దాదాపు 200 స్క్రీన్లలో రిలీజైంది అమెరికాలో. మంగళవారం ప్రిమియర్లతోనే 1.25 మిలియన్ల దాకా వసూలు చేసిన ‘ఖైదీ నెంబర్ 150’.. తర్వాత కొంచెం నెమ్మదించింది. శని ఆదివారాల్లో మళ్లీ పుంజుకుని 2 మిలియన్ మార్కును అందుకుంది. ఈ సినిమా ఫుల్ రన్లో 2.5 మిలియన్ డాలర్ల మార్కును దాటొచ్చు.
మరోవైపు దాదాపు 120 స్క్రీన్లలో రిలీజైన బాలయ్య సినిమా బుధవారం ప్రిమియర్ల ద్వారా 3.5 లక్షల డాలర్ల దాకా వసూలు చేసింది. తర్వాత కూడా స్టడీగా కలెక్షన్లు రాబడుతూ ఆదివారం మిలియన్ మార్కును దాటేసింది. బాలయ్యకు అమెరికాలో ఇది తొలి మిలియన్ డాలర్ మూవీ కావడం విశేషం. అప్పటిదాకా ‘లెజెడ్’ సినిమా 4.1 లక్షల డాలర్లతో హైయెస్ట్ గ్రాసర్ గా కొనసాగుతూ వచ్చింది. ‘శాతకర్ణి’ ఫుల్ రన్లో 1.5 మిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకునే అవకాశముంది.