Begin typing your search above and press return to search.
చిరంజీవి నాలుగు.. బాలయ్య ఎనిమిది
By: Tupaki Desk | 28 Jan 2017 10:31 AM GMTసంక్రాంతి సినిమాలు అమెరికాలో అదరగొట్టాయి. భారీ వసూళ్లతో యుఎస్ బాక్సాఫీస్ ను కళకళలాడించాయి. మూడు సినిమాలు కలిపి 5 మిలియన్ డాలర్ల దాకా వసూళ్లతో అదరగొట్టాయి. యుఎస్ లో తెలుగు టాప్ గ్రాసర్స్ లిస్టులో మరోసారి మార్పులు చోటు చేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నేరుగా టాప్-5లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. నందమూరి బాలకృష్ణ తొలిసారి టాప్-10లోకి అడుగుపెట్టాడు. నాలుగో స్థానంలో ఉన్న ‘ఖైదీ నెంబర్ 150’ మూడో స్థానంలో ఉన్న ‘అఆ’ను వెనక్కి నెట్టే ప్రయత్నంలో ఉండగా.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఎనిమిదో స్థానానికి ఫిక్సయ్యేలా ఉంది. ప్రస్తుతానికి యుఎస్ లో టాలీవుడ్ టాప్ గ్రాసర్స్.. అవి సాధించిన కలెక్షన్ల వివరాలు చూస్తే..
1. బాహుబలి (అన్ని వెర్షన్లూ కలిపి 8.46 మిలియన్ డాలర్లు.. తెలుగు వెర్షన్ మాత్రమే 6.998 మిలియన్ డాలర్లు)
2. శ్రీమంతుడు (2.89 మిలియన్ డాలర్లు)
3. అఆ (2.445 మిలియన్ డాలర్లు)
4. ఖైదీ నెంబర్ 150 (జనవరి 26 నాటికి 2.421 మిలియన్ డాలర్లు)
5. నాన్నకు ప్రేమతో (2.022 మిలియన్ డాలర్లు)
6. అత్తారింటికి దారేది (1.898 మిలియన్ డాలర్లు)
7. జనతా గ్యారేజ్ (1.8 మిలియన్ డాలర్లు)
8. గౌతమీపుత్ర శాతకర్ణి (జనవరి 27 నాటికి 1.635 మిలియన్ డాలర్లు)
9. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (1.635 మిలియన్ డాలర్లు)
10. ఊపిరి (1.619 మిలియన్ డాలర్లు)