Begin typing your search above and press return to search.
'నాన్నకు ప్రేమతో'ను బీట్ చేసిన ఖైదీ
By: Tupaki Desk | 16 Jan 2017 5:28 AM GMTఓవర్సీస్ మార్కెట్లో చిరు సత్తా చూపించేస్తున్నాడు. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికే యూఎస్ లో టాప్ 4లోకి వచ్చేసింది ఖైదీ నంబర్ 150. మాస్ మూవీకి యూఎస్ ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉంటుందా లాంటి అనుమానాల మధ్య రిలీజ్ అయిన ఖైదీ.. అనూహ్యంగా ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ దాటేశాడు.
ఇప్పుడు ఆదివారం నాటి కలెక్షన్స్ తో కలిపి 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అయిపోయింది ఖైదీ నంబర్ 150. యూఎస్ లో ఈ క్లబ్ లోకి ప్రవేశించగలిగిన ఐదో మూవీ ఇది. బాహుబలి.. శ్రీమంతుడు.. అఆ.. నాన్నకు ప్రేమతో చిత్రాల తర్వాత ఖైదీ మాత్రమే 2 మిలియన్ డాలర్లను సాధించగలిగింది. నాన్నకు ప్రేమతో ఫుల్ రన్ లో 20,19,418 డాలర్లను సాధించగా.. మెగాస్టార్ మూవీ తొలి వీకెండ్ పూర్తయ్యే సరికే 20,60,000 డాలర్లను వసూలు చేసేసి.. టాప్ 4లోకి వచ్చేసింది.
ఈ లిస్ట్ లో 2.89 మిలియన్ డాలర్లతో శ్రీమంతుడు రెండో స్థానంలోను.. 2.44 మిలియన్ డాలర్లతో అఆ మూడో స్థానంలోను ఉన్నాయి. మరి ఇప్పటికే టాప్4 లోకి వచ్చేసిన ఖైదీ నంబర్ 150.. తర్వాతి టార్గెట్స్ ఇవే. రెండో వీకెండ్ ముగిసే నాటికి 2.5 మిలియన్ డాలర్లను సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫుల్ రన్ లో ఖైదీ 3 మిలియన్లను సాధించగలిగితే.. టాప్ 2 కి చేరే ఛాన్సులు ఉంటాయి. బాహుబలి ది బిగినింగ్ 6.99 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉంది కాబట్టి.. ఆ రికార్డ్ కి వచ్చిన రిస్క్ ఏమీ ఉండదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/