Begin typing your search above and press return to search.
ఖైదీకి ఇంకా అర మిలియన్ కావాలి
By: Tupaki Desk | 14 Jan 2017 5:26 AM GMTతొలిరోజు ప్రీమియర్లతో కలుపుకుని షుమారు 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది ''ఖైదీ నెం 150''. మెగాస్టార్ చిరంజీవి రాక కోసం ఎంతో ఆతృతగా ఎదరుచూస్తున్న అభిమానులందరూ ఒక్కసారిగా ధియేటర్లకు చేరుకోవడంతో.. ఈ రేంజ్ కలక్షన్ పాజిబుల్ అయ్యింది. బాహుబలి తరువాత పొజిషన్లో ఒవర్సీస్ లో డే వన్ కలక్షన్ ఈ మెగా మూవీ నమోదు చేసిందంటే.. అభిమానులే అందుకు కారణం.
కట్ చేస్తే ఇప్పుడు ఖైదీ కలక్షన్లు కాస్త స్లో అయ్యాయ్. అంటే సినిమా బుధవారం రిలీజ్ అయ్యింది కాబట్టి.. వీకెండ్ వచ్చే వరకు కాస్త డల్ అయిపోతుందిలే. కాకపోతే మరీ స్లో అయిపోయిన ఖైదీ మాత్రం.. ఇప్పటివరకు మొత్తంగా కేవలం 1.5 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేశాడు. మరి వీకెండ్ వచ్చేసరికి ఈ కలక్షన్ల జోరు ఏ మాత్రం పెరుగుతుందో తెలియదు కాని.. సినిమాకు మాత్రం ఇంకో అర మిలియన్ వస్తేనే పంపిణీదారులకు కలిసొచ్చేది. ఇప్పటికే అమెరికాలో ఏ.ఎం.సి. అండ్ కార్మైక్ సంస్థల మెర్జర్ వలన.. డిస్ర్టిబ్యూటర్ షేర్ బాగా తగ్గిపోయింది. దానితో 2 మిలియన్ డాలర్లు వస్తేనే.. అక్కడ షేర్ 8 కోట్లు వరకు వచ్చే ఛాన్సుంది. (12 కోట్ల గ్రాస్ వస్తుందిలే). అలా వస్తేనే పంపిణీదారులు సేఫ్ అవుతారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇకపోతే తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 34+ కోట్ల షేర్ వసూలు చేసిన ఖైదీ నెం 150.. గురు శుక్రవారాల్లో కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ముఖ్యంగా బి అండ్ సి సెంటర్లలో చిరంజీవి మాంచి పట్టునే చూపిస్తున్నారు. మొత్తంగా 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఖైదీ నెం 150.. ఏ రేంజులో వసూలు చేస్తుందో చూడాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/