Begin typing your search above and press return to search.
వంద కోట్లు కొట్టేశాడు బాస్
By: Tupaki Desk | 17 Jan 2017 5:48 PM GMTబాస్ ఈజ్ బ్యాక్.. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవి రీఎంట్రీ గురించి ప్రచారం చేస్తుంటే అతిగా అనిపించింది కానీ.. ‘ఖైదీ నెంబర్ 150’ కలెక్షన్లు చూస్తే చిరు బాక్సాఫీస్ బాస్ అని ఒప్పుకోక తప్పదు. కేవలం ఆరు రోజులకే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది చిరు సినిమా. మామూలుగా బాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఇలాంటి ఘనతలు సాధ్యం. ‘బాహుబలి’ లాంటి అసాధారణ సినిమాల లెక్కా వేరు. కానీ ‘ఖైదీ నెంబర్ 150’ లాంటి మామూలు సినిమా ఆరో రోజుకే రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇక్కడే చిరు స్టామినా ఏంటో తెలుస్తుంది. సోమవారం నాటికి ‘ఖైదీ నెంబర్ 150’ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.106 కోట్లకు చేరుకోవడం విశేషం.
ఇక షేర్ వివరాలు చూస్తే.. తెలుగు రాష్ట్రాల వరకే ‘ఖైదీ నెంబర్ 150’ రూ.50 కోట్ల మార్కును దాటేయడం విశేషం. నైజాంలో రూ.13.17 కోట్లు.. సీడెడ్లో రూ.9.4 కోట్లు.. నెల్లూరులో రూ.2.25 కోట్లు.. గుంటూరులో రూ.5.09 కోట్లు.. కృష్ణాలో రూ.3.78 కోట్లు.. పశ్చిమ గోదావరిలో రూ.4.55 కోట్లు.. తూర్పుగోదావరిలో రూ.5.88 కోట్లు.. ఉత్తరాంధ్రలో రూ.7.22 కోట్లు.. ఇలా ప్రతి ఏరియాలోనూ రికార్డు స్థాయిలో షేర్ సాధిస్తూ ప్రకంపనలు రేపింది చిరు సినిమా. అమెరికాలో ఇప్పటికే ఈ చిత్రం 2.15 మిలియన్ డాలర్లు వసూలు చేసి.. 2.5 మిలియన్ మార్కు దిశగా సాగుతోంది. ఆరు రోజుల్లో ‘ఖైదీ నెంబర్ 150’ వరల్డ్ వైడ్ షేర్ రూ.70 కోట్లను టచ్ చేయడం విశేషం. రూ.90 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం ఫుల్ రన్లో అంత స్థాయిలో షేర్ వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే ‘శ్రీమంతుడు’ పేరిట ఉన్న నాన్-బాహుబలి రికార్డు బద్దలైనట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/