Begin typing your search above and press return to search.

అమెరికాలో సంక్రాంతి సినిమాల సందడిది!

By:  Tupaki Desk   |   18 Jan 2017 10:38 AM GMT
అమెరికాలో సంక్రాంతి సినిమాల సందడిది!
X
సంక్రాంతి పందెంకోళ్లు మూడూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అమెరికాలోనూ కాసుల‌ వ‌ర్షం కురిపిస్తున్నాయి. మెగాస్టార్ 150వ సినిమా "ఖైదీ నం.150", బాల‌య్య వందో చిత్రం "గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి" రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంటే మ‌రోప‌క్క "శ‌త‌మానం భ‌వ‌తి" కూడా త‌న స‌త్తా చాటుకోవ‌డం విశేషం. ఈ సినిమాల క‌లెక్ష‌న్ల వివ‌రాల‌ను ప్ర‌ముఖ బాలీవుడ్ సినీ విశ్లేష‌కుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

ఖైదీ నం.150 విడుద‌లై వారం రోజులు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ వ‌సూళ్లలో ముందువ‌ర‌స‌లోనే ఉంది. మంగ‌ళ‌వారం (జ‌న‌వ‌రి 10) 12.96 ల‌క్ష‌ల డాల‌ర్లు, బుధ‌వారం 15.8 ల‌క్ష‌లు - గురువారం 78వేలు - శుక్ర‌వారం 1.43 ల‌క్ష‌లు - శ‌నివారం 2.56 ల‌క్ష‌లు - ఆదివారం 1.8 ల‌క్ష‌లు - సోమ‌వారం 65వేల డాల‌ర్లు సంపాదించింది. మొత్తంగా చూస్తే 2.17 మిలియ‌న్ డాల‌ర్లు అంటే... సుమారుగా రూ.14.77 కోట్లతో ముందు వరుసలో నిలిచుంది. ఇదే జోరు కొన‌సాగితే ఈ సినిమా త్వ‌ర‌లోనే 2.5 మిలియ‌న్ డాల‌ర్ల మార్కును చేరుకోవ‌డం ఖాయ‌మంటున్నారు విశ్లేష‌కులు.

ఇక‌, శాతక‌ర్ణి విష‌యానికొస్తే... బుధ‌వారం 3.5 ల‌క్ష‌లు, గురువారం 1.37 ల‌క్ష‌లు - శుక్ర‌వారం 1.74 ల‌క్ష‌లు - శ‌నివారం 3.2 ల‌క్ష‌లు - ఆదివారం 2.41 ల‌క్ష‌లు - సోమ‌వారం 93వేల డాల‌ర్లు వ‌సూలుచేసింది. మొత్తం రూ.9.27 కోట్ల (1.36 మిలియ‌న్ డాల‌ర్లు) క‌లెక్ష‌న్ల‌తో తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఇదే క్రమంలో శ‌ర్వానంద్ న‌టించిన "శ‌త‌మానం భ‌వ‌తి" హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ మార్క్ దాటి త్వ‌ర‌లో మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్బులో చేర‌నుంది. ఈ సినిమా గురువారం 44వేలు - శుక్ర‌వారం 78వేలు - శ‌నివారం 1.5 ల‌క్ష‌లు - ఆదివారం 1.29 ల‌క్ష‌లు - సోమ‌వారం 61 వేల డాల‌ర్లు వ‌సూలు చేసింది. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ 4.61 లక్ష‌ల డాల‌ర్లు (సుమారు రూ.3.25 కోట్లు) క‌లెక్ట్ చేసింది. ఈ రేంజ్ లో సంక్రాంతి పందెం కోళ్లు మూడూ అమెరికాలో కాసుల వర్షాలు కురిపిస్తున్నాయి.