Begin typing your search above and press return to search.
యుఎస్ బాక్సాఫీస్ లో చిత్రాలు చూడండి
By: Tupaki Desk | 23 Jan 2017 3:58 PM GMTఅమెరికాలో ప్రిమియర్ షోలతో అనూహ్యమైన వసూళ్లు సాధించింది చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’. కానీ తర్వాత కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ప్రిమియర్ షోలతో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన బాలయ్య సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి’ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. వీకెండ్లో చిరు సినిమా మీద ఆధిపత్యం చలాయించింది. ఐతే ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన శర్వా మూవీ ‘శతమానం భవతి’.. అమెరికాలో స్థాయికి మించి పెర్ఫామ్ చేస్తోంది. రెండో వీకెండ్లో చిరు.. బాలయ్యల సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టిందీ చిత్రం.
రెండో వారాంతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ శుక్రవారం 43,877 డాలర్లు.. శనివారం 73,697 డాలర్లు.. ఆదివారం 17,000 డాలర్లు వసూలు చేసింది. ‘ఖైదీ నెంబర్ 150’ శుక్రవారం 36,517 డాలర్లు.. శనివారం 80,182 డాలర్లు.. ఆదివారం 21,000 డాలర్లు రాబట్టింది. ‘శతమానం భవతి’ శుక్రవారం 33,614 డాలర్లు.. శనివారం 64,054 డాలర్లు.. ఆదివారం 18,000 డాలర్లు వసూలు చేసింది. శుక్రవారం శాతకర్ణి మిగతా రెండు సినిమాలపై పైచేయి సాధించినా.. శని ఆదివారాల్లో మాత్రం ఆ చిత్రం ఆశించిన వసూళ్లు రాబట్టలేదు.
ఫస్ట్ వీకెండ్ నుంచి చాలా వరకు శాతకర్ణి కంటే వెనుకబడే ఉన్న ఖైదీ నెంబర్ 150.. రెండో శని ఆదివారాల్లో మాత్రం పైచేయి సాధించింది. ఇక బడ్జెట్.. స్టార్ కాస్ట్.. స్క్రీన్ల పరంగా ఈ భారీ సినిమాలతో పోలికే లేని ‘శతమానం భవతి’ రెండో వీకెండ్లో వాటికి దీటుగా వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఫుల్ రన్లో శాతకర్ణి 2 మిలియన్ మార్కును అందుకోవడం అసాధ్యంగానే కనిపిస్తుండగా.. ‘ఖైదీ నెంబర్ 150’ 2.5 మిలియన్ మార్కును టచ్ చేయొచ్చు. ‘శతమానం భవతి’ 7.5 లక్షల డాలర్ల మార్కును అందుకోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/