Begin typing your search above and press return to search.

ఖైదీ టాప్ 3లోకి వెళ్తాడా??

By:  Tupaki Desk   |   16 Jan 2017 4:04 AM GMT
ఖైదీ టాప్ 3లోకి వెళ్తాడా??
X
అమెరికాలో ఖైదీ నెం 150 సినిమా ఎవ్వరూ ఊహించని రేంజులో తొలిరోజు నుండి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఫస్ట్ డే 1 మిలియన్ పైగా వసూళ్లను కొల్లగొట్టి.. సినిమాలకు తిరిగొచ్చిన మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ రేంజ్ ఏంటో చెప్పేసింది. ఇక ఆదివారం వసూళ్ళతో ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసిందనే విషయం కూడా తెల్సిందే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. ఖైదీ ఓవర్సీస్ లో టాప్ 3లోకి అడుగుపెడతాడా అనేదే విషయం.

ప్రస్తుతానికి అమెరికా బాక్సాఫీస్ దగ్గర టాప్ 5 సినిమాలను చూసుకుంటూ.. ఖైదీ 5వ పొజిషన్లో ఉంది. ఆ జాబితాలో బాహుబలి (6.99 మిలియన్).. శ్రీమంతుడు (2.89 మిలియన్).. అ..ఆ (2.44 మిలియన్).. నాన్నకు ప్రేమతో (2.01 మిలియన్).. ఖైదీ నెం 150 (2 మిలియన్) సినిమాలున్నాయి. అయితే నాన్నకు ప్రేమతో సినిమాను ఖైదీ ఈజీగా బీట్ చేసేయొచ్చుకాని.. అ..ఆ ను బీచ్ చేసి టాప్ 3లోకి వెళ్ళాలంటే మాత్రం.. కాస్త టఫ్ అనే అనిపిస్తోంది. మళ్లీ మండే వచ్చేస్తే కలక్షన్లు కాస్త మందకొడిగా సాగుతాయి. కాబట్టి.. ఆ టాప్ 3 లో వెళ్ళడానికి ఖైదీ కాస్త కష్టపడాల్సిందే మరి.

ఇకపోతే ఓవరాల్ గా కూడా ప్రపంచవ్యాప్తంగా ఖైదీ వసూళ్ళు బాగానే ఉన్నాయి. మొదటి 4 రోజుల్లో మన తెలుగు రాష్ట్రంలలో 42 కోట్లు షేర్ షుమారు వసూలు చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/