Begin typing your search above and press return to search.
‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్ ఈ వెంట్ - హైలైట్స్
By: Tupaki Desk | 7 Jan 2017 5:08 PM GMTఫిలిం ఇండస్ర్టీ నుండి నెం.1గానే దూరం అయ్యారు చిరంజీవి. విచిత్రం ఏంటంటే.. ఆయన రీ-ఎంట్రీ సమయానికి కూడా ఆ పీఠం అలాగే ఖాళీగా ఉంది. దాదాపు 9 ఏళ్ళ తరువాత ఆ పీఠాన్ని తిరిగి అధిష్టాద్దామని కాకపోయినా కూడా.. మరోసారి తను అందించే ఆ టాప్ నాచ్ ఎంటర్టయిన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు చాలా సీరియస్ గా 150వ సినిమాతో వస్తున్నారు. ''ఖైదీ నెం 150'' అనే కత్తిలాంటి కథతో దిగుతున్నారు. అయితే ఈ సినిమా తాలూకు ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరుగుతోంది. విజయవాడ గుంటూరు హైవే లోని హాయ్ ల్యాండ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ లైవ్ అప్డేట్స్ ఎలా వరుసగా చూద్దాం.
1) బాస్ ఈజ్ బ్యాక్ అంటూ జరుగుతున్న ఈ ఈవెంట్ కు ఇసుక వేసిన రాలనంతమంది అభిమానులు విచ్చేశారు. హోరెత్తుతున్న వీలలు. అరుపులు. మెగాస్టార్ రాక కోసం ఎదురుచూపులు. గాల్లోకి లేచిన పెద్ద పెద్ద మెగా బెలూన్లు. అందరికీ ఈవెంట్ ఫీల్ గొప్పగా కలగాలని ఏర్పాటు చేసిన మెగా స్ర్కీన్లు. లైట్ల డెకరేషన్లో హాలీవుడ్ బీచ్ సైడ్ షోలను తలపించే స్టేజీ సెటప్.. వావ్.. అన్నీ సిద్దం అయిపోయాయ్.
2) ఈవెంట్ను ఆరంభించడానికి ముందుగా యథావిథిగా డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు ఒక ట్రూప్. 80 నిమిషాల్లో 80 చిరంజీవి పాటలకు డ్యాన్సులు వేశారు సత్య మాష్టర్ తీసుకొచ్చిన టీమ్. ఈ సందర్భంగా వాళ్ళు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మెగాస్టార్ సైన్ చేసిన ఎప్రీషియేషన్ సర్టిఫికేట్ ఒకటి వారికి అందించారు.
3) జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాను అందించిన మెగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్.. ''బాస్ ఈజ్ బ్యాక్'' అని గట్టిగా చెబుతూ.. అందరినీ అలరించారు అశ్వినీ దత్. అలాగే ఈ ఖైదీ నెం 150 మెగా హిట్ అవుతుందంటూ నిర్మాత డివివి దానయ్య కితాబిచ్చారు. ఈ సందర్బంగా వారు 'నీరు మీరు' సాంగ్ ను అక్కడ ప్లే చేయడం జరిగింది.
4) బాక్సాఫీస్ వెయిట్ చేస్తోంది. వెండితెర ఎదురు చూస్తోంది. కళామతల్లి తన ముద్దుబిడ్డి ఎప్పుడొస్తాడు అని వెలకమ్ చెప్పడానికి రెడీ ఉంది'' అంటూ తన డైలాగులతో యావత్ ఈవెంట్ ఏరియాను హోరెత్తించింది యాంకర్ సుమ.
5) గాయకుడు సింహా.. అండ్ సింగర్ సాయి శిల్ప.. చిరంజీవి ఆల్ టైం హిట్స్ కొన్ని ఆలపించారు. బేగంపేట బుల్లెమ్మో నుండి.. రూపు తేరా మస్తానా.. సాంగ్ వరకు.. సింహా ఉర్రూతలూగించాడు. వెరైటీగా జబర్ దస్త్ టీమ్ లోని గెటప్ శీను వంటి కొందరు ఈ పాటలకు డ్యాన్సులు కూడా వేశారు.
6) చంద్రుడి కోసం చీకటి ఎదురుచూసినట్లు.. సూర్యుడి కోసం పగలు ఎదురుచూసినట్లు.. వర్షం కోసం రైతు ఎదురుచూసినట్లు.. తల్లి కోసం బిడ్డ ఎదురుచూసినట్లు.. దేవుడి కోసం భక్తుడు ఎదురుచూసినట్లు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూశారు. కేరాఫ్ అడ్రస్ లేకుండా చెన్నపట్నం చేరిన మెగాస్టార్.. ఇవాళ ఇంతమంది కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. ఇవాళ ఎంతోమందికి ఆయనే కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఏ ఇంట్లో పెద్దకొడుకు బాగుంటాడో ఆ ఇల్లు బాగుంటుంది అంటారు. అందుకే తనతో పాటు ఇంతమందిని చిరంజీవి గారు తన ఇంటినుండి కళారంగానికి పరిచయం చేశారు చిరంజీవిగారు'' అంటూ చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ.
7) 1978లో మేం చలిచీమలు సినిమాతో వస్తే.. ఆయన ప్రాణం ఖరీదుతో వచ్చారు. తరువాత 'ఖైదీ'తో ఆయనతో తొలిసారి పనిచేశాం. ఆ తరువాత ఆయన 90 సినిమాలు చేశారు (ఖదీ ఆయన 59వ సినిమా). ఆ 90లో 30 సినిమాలు మేం చేశాం. సో 1/3 వంతు సినిమాలకు మేమే రాసినందుకు మాకు ఆనందంగా ఉంది. పగ తీర్చుకోవడానికి ఈ జన్మ ఎత్తాను. ప్రేమించడానికి ఇంకో జన్మ ఎత్తుతాను అంటూ ఖైదీలో ఒక డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు.. అల్లు అర్జున్ అభిమానులు.. రామ్ చరణ్ అభిమానులు.. ఇలా మెగా అభిమానులందరికీ చిరంజీవిగారు అద్భుతమైన కానుక ఇస్తున్నారు చిరంజీవి గారు'' అన్నారు పరుచూరి వెంకటేశ్వరరావు.
8) ఫైట్ మాష్టర్లు రామ్ అండ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ''చిన్న విలేజ్ నుండి అన్నయ్యను చూసి సినిమా ఇండస్ర్టీకి వచ్చాం. జేబుదొంగ సినిమా చూశాం. ఖైదీ నెం 786లో ఫైటర్స్ గా ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఖైదీ నంబర్ 150లో ఇప్పడు ఫైట్ మాష్టర్ గా చేశాం. ఇలాంటి ఒక పెద్ద సినిమాలో అన్నయ్యతో కలిచేసే అవకాశం కల్పించినందుకు రామ్ చరణ్ గారికి.. వివి వినాయక్ గారికి కృతజ్ఞతలు. ''ఒక మంచి భక్తి ఉంటే భగవంతుడుకి అందం. మంచి పిల్లాడుంటే తల్లిదండ్రులకు అందం. మంచి ఫ్యాన్స్ ఉంటే మెగాస్టార్ కు అందం. ఆయన గ్యాంగ్ లీడర్ లో ఎంత ఎనర్జటిక్ గా ఫైట్ చేశారో.. ఇప్పుడు కూడా అంతే ఎనర్జటిక్ గా ఉన్నారు.
9) మెగాస్టార్ కు పద్మభూషన్ అవార్డు వచ్చినప్పుడు అమితాబ్ బచ్చన్ చెప్పారు చిరంజీవి గారు కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని. అది నిజం. ఆయన డెడికేషన్ అండ్ ఈ అభిమానం చూస్తుంటే ఆ విషయం అర్దమవుతోంది. పవన్ కళ్యాణ్ గారు హార్ట్ ఫుల్లీ ఆయన విషెస్ ఈ ఖైదీ నెం 150 టీమ్ కు అందించారు'' అంటూ చెప్పారు నిర్మాత.. మెగా ఫ్యామిలీకి మాంచి స్నేహితుడు శరత్ మరార్.
10) స్టేజీపై ఉద్వేగభరితంగా ప్రసంగించాడు మెగా బ్రదర్ నాగబాబు. ఆయన పేర్లు చెప్పకుండా రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ ను.. అలాగే డైరక్టర్ రామ్ గోపాల్ వర్మను ఏకిపారేశాడు.
11) మెగాస్టార్ చిరంజీవి అండ్ టీమ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు స్టేజీపై ''ట్రైలర్ లాంచ్'' అనడంతో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యింది. ఆ తరువాత ప్రసంగించిన దాసరి.. చిరంజీవి తన రీ-ఎంట్రీపై ఉన్న డౌట్లన్నీ ఈ సినిమాతో పటాపంచలు చేశాడని చెప్పుకొచ్చారు. డౌట్లన్నీ మానుకుని ఈ సినిమా చూడమని చెప్పారు.
12) తెలుగులో మాట్లాడానికి ఫుల్లుగా ప్రయత్నించిన కాజల్ అగర్వాల్.. అబ్బో రచ్చ లేపేసింది. అమ్మడు తన జీవితంలో డిఫైనింగ్ పాయింట్ చిరంజీవి గారితో సినిమా చేయడం అని చెప్పింది. పైగా చిరంజీవి గారు మైండ్ బ్లోయింగ్ అంటూ పొగిడేసింది. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన చరణ్ కు ఆల్ ది బెస్ట్. తను నాకు మంచి ఫ్రెండ్.. ఆ తరువాత కో-స్టార్ అండ్ ఎవిరీ థింగ్... అంటూ తెలుగులో తెగ మాట్లాడేస్తూ కాజల్ ఉర్రూతలూగించింది.
13) ''చిరంజీవి.. పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. హీరోలుగా నేనొక సినిమా చేయాలని అనుకుంటున్నాను. పక్కనే అల్లు అరవింద్ నన్ను గైడ్ చేస్తాడు. ఖైదీ నెం 150 అద్భుతంగా ఆడుతుంది'' అంటూ మాజీ ఎంపి అండ్ ప్రొడ్యూసర్ సుబ్బిరామి రెడ్డి చెప్పారు.
14) మా నాన్నగారు లేని లోటు నాకు తీర్చారు. ఆయన లేని తరువాత.. నాకు ఒక పెద్దన్నయ్యలా నా వెన్నంటే ఉండి నన్ను గైడ్ చేస్తున్న అన్నయ్య చిరంజీవి గారికి ఆజన్మాంతం ఋణపడి ఉంటాను అంటూ చెప్పారు వివి వినాయక్.
15) ''ఎత్తిన ప్రతీవేలు ముడుచుకోవాలి.. జారిన ప్రతీ నోరు మూసుకోవాలి..'' అంటూ బీభత్సమైన పంచ్ వేశాడు స్టయిలిష్ స్టార్. ఈ సినిమా ఒక స్వీట్ వార్నింగ్ అవ్వాలని కోరుకుంటున్నాడట. (ట్రైలర్లో డైలాగ్ నే చెప్పాడా?) ''ఈరోజే సినిమా రిలీజైందా అన్నట్లుంది ఇంతమంది అభిమాన సందోహాన్ని చూస్తుంటే'' అన్నాడు రామ్ చరణ్.
16) ఉర్దూ షాయరీలోని.. ఒక పొయెట్రీ కోట్ చేస్తూ.. 2007లో శంకర్ దాదా జిందాబాద్ పేకప్ అయ్యాక.. తిరిగి 2017లో ఖైదీ నెం 150కు మేకప్ వేసుకున్న క్షణం వరకు.. మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు పది క్షణాల్లా గడిచిపోయాయ్ అన్నారు చిరంజీవి.
17) ఏదో ఒక పేపర్లో ఖైదీ 150గా చిరంజీవి అంటూ ఒక వ్యాసం రాగానే.. నా చొక్కా మీద ఉన్న 150 చూసి ఆ పత్రిక వారు అలా హెడ్డింగ్ పెడితే.. ''ఖైదీ నెం 150'' పెట్టండి అని దాసరి నారాయణరావు సూచించారని చెప్పారంటూ.. మెగాస్టార్ చెప్పుకొచ్చారు.
18) మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ పూర్తవ్వడంతో (పూర్తి స్పీచ్ మా ప్రత్యేక ఆర్టికల్ లో చూడగలరు) ఇక ఈవెంట్ ముగిసింది. అప్పటికే అభిమానులను కంట్రోల్ చేయడంలో ఆర్గనైజర్లకూ.. పోలీసులకూ.. ఇతర సెక్యూరిటీ స్టాఫ్ కు ఇక్కట్లు తలెత్తడంతో.. త్వరితగితన ఈవెంట్ ముగించేశారు. అనుకున్నదానికంటే ఎక్కువగా జనాలు తరలిరావడంతో.. కాస్త ప్రెజర్ మధ్యన ఈవెంట్ ముగిసింది. బహుశా అందరూ సేఫ్ గా ఇంటికి చేరుకుంటారని ఆశిద్దాం. జై హింద్. -తుపాకీ ప్రత్యేక డెస్క్.. ఫ్రమ్ గుంటూర్.