Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: హీరోయిజం నా ఇంట్లో ఉంటది

By:  Tupaki Desk   |   7 Jan 2017 12:34 PM GMT
ట్రైలర్ టాక్: హీరోయిజం నా ఇంట్లో ఉంటది
X
''పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది''.. ''వెయిటింగ్'' అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ ను పూర్తి చేస్తుంటే.. అబ్బో అదిరిపోయిందంతే. ఈ రేంజ్ టాపులేపేసే డైలాగులు అసలు విని చాలారోజులైందేమో.. చిరంజీవి ఫుల్ కిక్కిచ్చారనే వేరే చెప్పక్కర్లేదు. పదండి ''ఖైదీ నెం 150'' ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

ఎలా ఉన్నారా? అని చిరంజీవి అడిగితే.. నీలాగే ఉన్నావ్ అంటూ ఆలీ చెప్పడంతోఈ ఖైదీ తాలూకు కిక్ మొదలవుతుంది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150లో ఏ అంశాన్నీ వదిలిపెట్టలేదని చెప్పడానికి ఈ ట్రైలర్ నిదర్శనం. డ్యాన్సులు.. కామెడీ సీన్లు.. ఫైట్లు.. డైలాగులు.. మొత్తంగా కుమ్మేశారు మెగాస్టార్. లక్షలు కోట్లున్న ఒక మల్టీ నేషనల్ కంపెనీతో వేల రూపాయలను కూడా చూడని ఒక రైతు కోసం పోరాటమే ఈ సినిమా. రత్నవేలు ఫోటోగ్రాఫీ.. సుస్మిత డిజైన్ చేసిన చిరంజీవి బట్టలు.. వినాయక్ టేకింగ్.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్.. ఇలా అన్ని కూడా ఒక ఊరమాస్ ఖైదీని తయారు చేశాయ్. అతడు రైతుల కోసం ఎలా పోరాడతాడు అనేదే సినిమా. ఊర మాస్ తో సంక్రాంతికి ఫుల్ ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చేస్తాడు ఖైదీ అని ఈ ట్రైలర్ చూపి చెప్పేసుకోవచ్చు మరి.

ట్రైలర్ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ డైలాగ్స్..

--నాది వన్ వే.. కష్టం వస్తదో కార్పొరేట్ సిస్టం వస్తదో రమ్మను..

--వడ్లగింజల నుండి తాలింపు గింజల దాకా.. కరివేపాకు నుండి కందిపప్పుదాక.. మినప నుంచి మిరపదాకా.. అన్నీ పల్లెటూళ్ల నుంచే రావాలి..

--పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఒంట్లో ఉంటది..