Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ః ఆకట్టుకున్న ఖాకీ
By: Tupaki Desk | 17 Oct 2017 12:43 PM GMTకోలీవుడ్ హీరో కార్తీ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేశాడు. అప్పట్లో యుగానికి ఒక్కడు కోలీవుడ్ లో అంతగా అడకపోయినా తెలుగులో మాత్రం ఆ సినిమా కార్తీకి మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది. అన్నయ్య సూర్య లానే కార్తీ కూడా టాలీవుడ్ ఫ్యాన్స్ కి కొన్ని సినిమాలతోనే చాలా క్లోజ్ అయిపోయాడు. అయితే గత కొంత కాలంగా ఆయన రీమేక్ సినిమాలు టాలీవుడ్ లో హిట్ అవ్వడం లేదు. చివరగా ఊపిరి తో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. మళ్లీ ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను మెప్పించాలని త్వరలో ఒక సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఖాకి అనే సినిమాతో రాబోతున్నాడు. రీసెంట్ గా చిత్రం యొక్క ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.
ట్రైలర్ లో ముందే స్టోరీ అర్థమవుతున్నా సినిమా ఎలా ఉండబోతోంది అనే పాయింట్ ప్రతి ఒక్కరిలో మనసులో మెదులుతోంది. ఈ సినిమా 1995 నుంచి 2005 మధ్యలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కబోతోందని చెప్పేశారు. ఇక మన తెలుగువారిని అట్రాక్ట్ చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జాతీయ రహదారి పక్కన, జన సంచారం లేని ఇంటిలో జరిగిన అనే వాయిస్‌తో ట్రైలర్ ని స్టార్ట్ చేశారు. కార్తీ యాక్షన్ మూమెంట్స్ చాలా బావున్నాయనే చెప్పవచ్చు. ఇక మరొక రెండు డైలాగులు సినిమా క్రేజ్ తెచ్చేలా కనిపిస్తున్నాయి. పోలీసోళ్లు వత్తారు, చూత్తారు, పోతారు.. ఈ జనాన్ని కాపాడేదెవురు?.. అలాగే పవర్‌లో ఉన్నోడి ప్రాణానికి ఇచ్చే విలువ.. పబ్లిక్ ప్రాణానికి ఎందుకివ్వరు సార్?.. అంటూ కార్తీ చెప్పిన డైలాగ్ చాలా పాజిటివ్ కామెంట్స్ ని అందుకుంటోంది.
ఓ వర్గం ప్రేక్షకులని ఈ సినిమా ఆకర్షించే విధంగా ఉందని చెప్పవచ్చు. ఫైనల్ గా కార్తీ ట్రైలర్ ఎండింగ్ లో చెప్పిన డైలాగ్ కూడా మంచి సోషల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంలో ఉంటుందనే భావనను కలిగిస్తోంది. 'మనం చెడ్డవాళ్ల నుంచి మంచివాళ్లను కాపాడే పోలీస్ ఉద్యోగం చేయట్లేదు, మంచివాళ్ల నుంచి చెడ్డవాళ్లని కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం సార్' అనే డైలాగ్ చాలా బావుంది. ఇక రకుల్ కూడా కొంచెం గ్లామర్ గా కొంచెం హోమ్లీగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె చెప్పిన డైలాగ్ కూడా చాలా బావుంది. 'ఎన్ని ట్రాన్స్‌ఫర్లు, హాయిగా లంచం తీసుకుని ఒకేచోట ఉండవా' అంటూ..మెప్పించే ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా సినిమాపై ఈ ట్రైలర్ అంచనలును పెంచిందనే చెప్పవచ్చు. చూడాలి మరి కార్తీ ఎంతవరకు ఆకట్టుకుంటాడో..