Begin typing your search above and press return to search.
ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ తో దొరికిపోయిన ఖాన్
By: Tupaki Desk | 30 March 2022 3:30 AM GMTఖాన్ లు ఒక్కొక్కరుగా బరస్ట్ అవుతున్నారు. ఇన్నాళ్లు దాచిన నీటి మూట నుంచి ఒక్కో డ్రాప్ కరిగి నేలపాలవుతుంటే ఆవేదన తన్నుకొస్తోంది. సక్సెస్ లేక తికాణా లేక అన్నట్టే అయిపోయింది పరిస్థితి. ఓ వైపు సౌత్ నుంచి దూసుకొస్తున్న వెరైటీ మాస్ యాక్షన్ సినిమాల ధాటికి హిందీ పరిశ్రమలో కొత్త డౌట్లు పుట్టుకొచ్చేశాయి. మన సినిమాని సౌత్ లో చూడరు కానీ సౌత్ సినిమాకి ఇక్కడ బ్రహ్మరథం పట్టేస్తున్నారు ఆడియెన్! అంటూ ఖాన్ లు కిలాడీలే వాపోతున్నారు.
మొన్నటికి మొన్న ఒక వేదికపై కిలాడీ అక్షయ్ కి లేడీ జర్నలిస్టు నుంచి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్న ఎదురైంది. పుష్ప సినిమా ముందు హిందీ సినిమాలు తేలిపోయాయని సదరు జర్నలిస్టు స్పష్ఠంగానే అడిగేసింది. దానికి కిలాడీ అక్షయ్ కుమార్ నీళ్లు నమిలాడు.
ఇప్పుడు సల్మాన్ ఖాన్ అంతటి వాడే ఓపెనైపోయాడు. ఏదీ దాచుకోలేకపోయాడు. తనలోని ఆవేదనను బహిరంగంగా వెల్లగక్కాడు. బాప్ రే అసలు మన హిందీ సినిమాలు సౌత్ లో ఆడవు కానీ..! అంటూ ఆవేదన చెందాడు. మన సినిమాలు దక్షిణాదిలో ఎందుకు బాగా ఆడటం లేదనేది అర్థంగాక నేను ఎంతో ఆశ్చర్యపోతున్నాను. వారి సినిమాలు ఇక్కడ బాగా ఆడుతున్నాయి.. అంటూ పబ్లిగ్గా తనలో దాగి ఉన్న ఇన్ సెక్యూరిటీని బయటపెట్టాడు.
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ సోమవారం పాన్ ఇండియా చిత్రాల గురించి .. మెగాస్టార్ చిరంజీవితో తన తదుపరి చిత్రం గురించి మాట్లాడారు. హిందీ సినిమాలకు ‘హీరోయిజం’ ఉండాల్సిన ఆవశ్యకత గురించి కూడా ఆయన మాట్లాడారు. చిరంజీవి తదుపరి చిత్రం గాడ్ ఫాదర్ లో తాను ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నట్లు సల్మాన్ తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం అని అన్నారు. చిరు గారు నాకు చాలా కాలంగా తెలుసు. అతను స్నేహితుడు కూడా అయ్యాడు. చిరు కొడుకు (రామ్ చరణ్) కూడా స్నేహితుడు. ఆర్.ఆర్.ఆర్ లో ఇంత అద్భుతమైన ప్రదర్శనతో చరణ్ ఆకట్టుకున్నాడు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన చిత్రం విజయం సాధించినందుకు శుభాకాంక్షలు చెప్పాను. నేను అతని గురించి చాలా గర్వపడుతున్నాను. చరణ్ ఇంత బాగా చేయడం సూపర్భ్. కానీ దక్షిణాదిలో మన సినిమాలు ఎందుకు అంతగా ఆడడం లేదని నేను ఎంతో ఆశ్చర్యపోతున్నాను. వారి సినిమాలు ఇక్కడ బాగా ఆడుతున్నాయి.. అని అన్నారు.
ముంబై నగరంలో జరిగిన IIFA అవార్డ్స్ 2022 విలేకరుల సమావేశంలో స్టార్ హీరో సల్మాన్ మాట్లాడారు. ఈ అవార్డుల కార్యక్రమం మే 20 - 21 తేదీల్లో అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో జరగనుంది. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ ``హీరోయిజం ఉన్న సినిమాలు`` చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వారు (దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ) ఎల్లప్పుడూ హీరోయిజాన్ని నమ్ముతారు. అలాగే మేము కూడా నమ్ముతాము. థియేటర్ నుంచి బయటకు రాగానే హీరోయిజం కావాలి. ఇక్కడ ఒకరిద్దరు తప్ప మనం హీరోయిజంతో కూడుకున్న సినిమాలు చేయడం లేదు. లైఫ్ కంటే పెద్ద హీరోయిజం చూపే చిత్రాలను మనం మళ్లీ ప్రారంభించాలి. నేను అది మాత్రమే చేస్తున్నాను. అయితే నేను ఈ రోజుల్లో ఏమని భావిస్తున్నానంటే.. ప్రజలు కూల్ గా మారారు.. నేను క్లిచ్ గా మారానని అనుకుంటారు.. అంటూ బాహాటంగానే అసంతృప్తిని బయటపెట్టాడు భాయ్.
``హీరోయిజం ఎల్లప్పుడూ పని చేస్తుంది. ఎందుకంటే ఒక రకమైన కనెక్ట్ ఉంటుంది. అది (సినీ ప్రేక్షకులకు) చాలా ముఖ్యమైనది. మేము సలీం-జావేద్ కాలం నుండి ఈ ఫార్మాట్ ను కొనసాగిస్తున్నాము. కానీ ఇప్పుడు వారు (దక్షిణ భారత చలనచిత్ర నిర్మాతలు) దానిని తదుపరి స్థాయికి తీసుకువెళుతున్నారు. అక్కడ (సౌత్ ఇండియా) ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. ఇప్పుడు నేను కూడా చిరంజీవి గారితో కలిసి పనిచేస్తున్నాను. వారు విభిన్నమైన చిత్రాలను చేస్తున్నారు. ఈ వ్యవహారం చాలా బాగుంది. మీరు దబాంగ్ సిరీస్ ని చూస్తే... పవన్ కళ్యాణ్ దాన్ని తెలుగులోకి రీమేక్ చేశారు. దక్షిణాదిన పని చేయాలనుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలి. ఇప్పుడు మేము కభీ ఈద్ కభీ దీపావళి చేస్తున్నాము. అలాంటి తరుణం రావాలి. మన సినిమాలను మళ్లీ వాళ్లు రీమేక్ చేస్తారు. దక్షిణాదిలో రచయితలు చాలా కష్టపడి పనిచేస్తారు. బ్యూటీఫుల్ కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తున్నారు. చిన్న సినిమాలు చేసినా జనాలు వెళ్లి చూస్తారు. నేను అనుకుంటున్నాను.. ఇక్కడ ఏం జరిగింది? భారతదేశం కఫ్ పరేడ్ (దక్షిణ ముంబైలో) నుండి అంధేరి (సబర్బన్ ముంబై) వరకు మాత్రమే అని ప్రజలు అనుకుంటున్నారు. అయితే కఫ్ పరేడ్ - అంధేరీ తర్వాత హిందుస్థాన్ మొదలవుతుందని నేను అనుకుంటున్నాను. అసలైన హిందుస్థాన్ బాంద్రా ఈస్ట్ (సబర్బన్ ముంబై)లో రైలు పట్టాల పక్కన ఉంది. నా సినిమాలు కూడా వాళ్ల కోసమే. వారు మంచి సందేశంతో కూడా వచ్చారు. సినిమా చూసిన తర్వాత వారిలో రక్తాన్ని ఎక్కువగా పంపింగ్ చేయాలి అంటూ భాయ్ ఛమత్కరించాడు.
సల్మాన్ సౌత్ ఇండియన్ సినిమాలను రీమేక్ చేయడాన్ని ఎంతగానో ఆస్వాధిస్తానని కూడా తెలిపారు. కానీ అతనికి ఇటీవల ఇంకా ఆఫర్ రాలేదు. వారు నా వద్దకు వచ్చినప్పుడు.. వారు తమిళం లేదా తెలుగు సినిమాల కోసం నా వద్దకు రారు. వారు హిందీ కోసం నా దగ్గరకు వస్తారు... అని తెలిపారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సల్మాన్ ఖాన్ తర్వాత YRF టైగర్ 3లో కనిపించనున్నారు. వరుసగా భారీ చిత్రాల లైనప్ కూడా ఉంది.