Begin typing your search above and press return to search.
కింగ్ ఖాన్ బౌన్స్ బ్యాక్ అయ్యేదెప్పుడు?
By: Tupaki Desk | 5 Oct 2019 1:30 AM GMTబాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ప్రస్తుత సన్నివేశం తెలిసిందే. దశాబ్ధాల పాటు ఎదురే లేని రారాజుగా ఏలిన ఖాన్ పరిస్థితి అయోమయంలో పడిపోయింది. కొన్నేళ్ళుగా ఆయన సినిమాలేవీ హిట్టు అన్నదే లేక.. తీవ్ర సంక్షోభంలో పడిపోయారు. జీరో- ట్యూబ్ లైట్- రాయీస్- జబ్ హ్యారీ మెట్ సెజల్ ఇవన్నీ తీవ్రంగా నిరాశపరిచాయి. బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టించిన షారూక్ ఇది ఊహించనిది. ఇటీవలే రిలీజైన జీరో అన్నిటినుంచి బయటపడేస్తుందని నమ్మితే అది కూడా డిజాస్టర్ గా నిలిచింది.
అందుకే గత కొంతకాలంగా సైలెంటుగా ఉన్నాడు బాద్ షా. వరుస పరాజయాలు కలవరానికి గురి చేయడంతో ఎంతో జాగ్రత్తగా తదుపరి చిత్రానికి సంబంధించిన కసరత్తులు చేస్తున్నాడు. కొన్నాళ్లు సినిమాల నుండి బ్రేక్ తీసుకుని ఎంతో ప్రశాంత చిత్తంతో ఎలాంటి కథల్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలో కసరత్తు చేశాడట. ఎట్టకేలకు తన దృష్టిలో ఉన్న మూడు కథల్లోంచి ఒకటి ఫైనల్ చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలిసింది.
తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో షారూక్ స్వయంగా దీనిపై మాట్లాడారు. తనకు బాగా అచ్చొచ్చిన డాన్ సిరీస్ లో డాన్ 3 కథపైనా.. అలాగే బ్లాక్ బస్టర్ సిరీస్ అయిన దూమ్ 4పైనా బాద్ షా దృష్టి సారించారని.. హాలీవుడ్ చిత్రం కిల్ బిల్ రీమేక్ పైనా వర్క్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే ఇవేవీ నిజాలు కావని ఖండించిన బాద్ షా మరో రెండు మూడు నెలల్లోనే ఏ చిత్రంలో నటిస్తున్నది ప్రకటిస్తానని తెలిపారు.
అలాగే ఓ వీరాభిమాని షారూక్ కి నేరుగా ఇన్ స్టాలో టచ్ లోకి వెళ్లి తన ఆందోళనను వ్యక్తం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్నో ఏళ్లుగా తన కలతలన్నీ పోవడానికి కారణం షారూక్ అని.. ఆయన ఫోటోలు.. వీడియోలు చూసి బతికేస్తున్నానని తొందర్లోనే షారూక్ ప్రస్తుత సన్నివేశం నుంచి బయటపడాలని ఆకాంక్షించాడు ఆ వీరాభిమాని.