Begin typing your search above and press return to search.
చేతులు కలిపి కత్తులు నూరుతున్న ఖాన్ లు!
By: Tupaki Desk | 20 Jun 2022 6:32 AM GMTఎన్నడూ లేనిది ఖాన్ లు ఎలాంటి భేషజానికి పోకుండా కలిసి సినిమాల్లో నటిస్తున్నారు. ఒకరితో ఒకరు చేతులు కలిపి ఏదైనా సాధించాలని తపనతో ఉన్నారు. ముఖ్యంగా సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాల వెల్లువను పాన్ ఇండియా స్టార్ల తాకిడిని తట్టుకోలేని క్రమంలో ఖాన్ ల ఆలోచనా పరిధి విస్తరిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇన్నాళ్లు తోపులం అని చెప్పుకున్న సదరు ఖాన్ లకు పాన్ ఇండియా హిట్టు కనిపించకపోడంతో ఈ పోటీని తట్టుకునేందుకు వైవిధ్యమైన ప్రణాళికలతో దూసుకొస్తున్నట్టు కనిపిస్తోంది. 1000 కోట్లు అంతకుమించి బాక్సాఫీస్ ఫిగర్స్ ని చూపించి తాము కూడా పాన్ ఇండియా స్టార్లు అని నిరూపించాలన్న కసి పంతం వీళ్లలో కనిపిస్తోంది.
అయితే పాన్ ఇండియా రేంజులో స్టార్ డమ్ ని సాధించాలంటే సదరు స్టార్లు సౌత్ వైపు చూడాల్సిన సన్నివేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాది ట్యాలెంట్ కంటే సౌత్ ట్యాలెంట్ తో గమ్మత్తయిన ప్రణాళికల్ని వేస్తున్నారు. సల్మాన్ పూర్తిగా బ్యాక్ టు బ్యాక్ సౌత్ రీమేక్ లపై కన్నేస్తే.. షారూక్ ఏకంగా అట్లీ లాంటి సౌత్ దర్శకుడినే నమ్మి భారీ సినిమా చేస్తున్నాడు.
ఆసక్తికరంగా సల్మాన్ - షారూక్ ఇద్దరూ ఒకరికోసం ఒకరు అంటూ మమేకం అవుతున్నారు. చేతులు కలిపి ఒకరి సినిమాలో ఒకరు నటించడం ద్వారా యూనివర్శ్ లు మల్టీవర్శ్ లతో ప్లాన్ ని మరింతగా బలంగా వేగవంతం చేస్తున్నారని తెలిసింది. మునుముందు ఖాన్ లు ఇరువురూ కలిసి ఇంకా చాలా దూరం వెళ్లే ఆలోచనతో ఉన్నారని కూడా తెలిసింది. ఈ ఇద్దరు ఖాన్ లు బాక్సాఫీస్ వద్ద బలమైన పునరాగమనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇటీవల వీరిద్దరూ చేతులు కలిపి ఒకటి కాదు రెండు సినిమాల్లో కలిసి నటిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రం జనవరి 2023 విడుదల కానుంది. ఇందులో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా.. జాన్ అబ్రహం విలన్‌గా నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సల్మాన్ 10 నిమిషాల అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సల్మాన్ తన పోర్షన్ లను పూర్తి చేసాడు. ఈ సన్నివేశాలు అభిమానులకు ట్రీట్ అవుతాయని సమాచారం. మరోవైపు సల్మాన్ చిత్రం టైగర్ 3లో షారూఖ్ అతిధి పాత్రలో నటిస్తున్నాడు.
మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్ కథానాయిక. ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటించారు. ఇది 2023 ఈద్ విడుదలకు సిద్ధంగా ఉంది. షారూఖ్ త్వరలో టైగర్ 3 లో తన పార్ట్ చిత్రీకరణ ముగించనున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ సీన్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పఠాన్ - టైగర్ 3 రెండూ గూఢచారి చిత్రాలే కాబట్టి నిర్మాతలు SRK - సల్మాన్ పాత్రల ఆధారంగా గూఢచారి విశ్వాన్ని సృష్టిస్తున్నారు. మొత్తం మీద వచ్చే ఏడాదిలో రెండుసార్లు SRK -సల్మాన్ కలిసి పెద్ద స్క్రీన్ పై ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు.
అయితే ఖాన్ ల ప్లాన్ ఎంతవరకూ వర్కవుటవుతుంది? ఈ ఇద్దరూ కలిసి నటించే సినిమాలకు నార్త్ లో కాకుండా సౌత్ లో ఎంతవరకూ రీచబులిటీ ఉంటుంది? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. ఒకవేళ ఖాన్ లు ఇద్దరూ కనిపించే ఈ చిత్రాల్లో సౌత్ ప్రముఖ హీరోలు కూడా కనిపిస్తే అది మార్కెట్ పరంగా మరింత విస్త్రతంగా కలిసొచ్చేదని కూడా విశ్లేషిస్తోంది ఒక సెక్షన్. ఖాన్ లు మునుముందు దీనిపై మరింత కసరత్తు చేసే వీలుంది. యూనివర్శ్ లు మల్టీవర్శ్ ల కల్చర్ లో తెలుగు స్టార్ హీరోలతో కలిసి ఖాన్ లు పని చేసే అవకాశాన్ని ఇప్పటికి కొట్టి పారేయలేం. రొటీన్ కి భిన్నంగా లోచిస్తేనే కొత్త అంశాల చేరిక సాధ్యమవుతుంది. పరమ రొటీన్ పాత చింతకాయ విధానాలను వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్న బాలీవుడ్ కి ఇది చాలా అవసరమని కూడా క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.