Begin typing your search above and press return to search.
ఖిలాడీ అక్షయ్ రెండు వరుస అతిపెద్ద డిజాస్టర్లు
By: Tupaki Desk | 18 Aug 2022 2:30 AM GMTఅక్షయ్ కుమార్ నటించిన `సామ్రాట్ పృథ్వీరాజ్` డిజాస్టర్ రిజల్ట్ తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇంతలోనే అతడు నటించిన `రక్షా బంధన్` అంతకంటే దారుణ ఫలితాన్ని చవి చూస్తోంది. ఈ మొదటి మంగళవారం నాటికే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నీరసించిపోయింది.
ఈ చిత్రం ఆరవ రోజు అంచనాలను మించి క్రాష్ అయింది. మంగళవారం నాడు 1.35 నుండి 1.75 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇప్పటికి మొత్తం వసూళ్లు రూ. 36 కోట్లు. గత 10 ఏళ్లలో అతిపెద్ద చెత్త సినిమాల జాబితాలో `రక్షా బంధన్` పేరు చేరింది. ఈ మంగళవారం నాటికే కలెక్షన్లు 82 శాతం పడిపోయాయని బాలీవుడ్ మీడియాలు పేర్కొన్నాయి.
ఈ చిత్రం అక్షయ్ గత చిత్రాలైన సామ్రాట్ పృథ్వీరాజ్ - బచ్చన్ పాండే - బెల్ బాటమ్ కంటే దారుణంగా ట్రెండ్ అవుతోంది.
మంగళవారం నాటి కలెక్షన్లతో రక్షా బంధన్ జీవితకాల వసూళ్లు రూ. 45 కోట్లతో సరిపెట్టుకుంటుందని ట్రేడ్ అంచనా వేసింది. దీంతో ఈ మూవీ థియేట్రికల్ డిజాస్టర్ గా నిలిచిందని టాక్ వినిపిస్తోంది.
నిజానికి వారం పాటు రకరకాల సెలవులు లేకపోతే ఫలితం ఇంకెంత దారుణంగా ఉండేదో! రక్షా బంధన్ జీవితకాల కలెక్షన్లు బెల్ బాటమ్ (రూ. 35 కోట్లు) రేంజు కంటే తక్కువగా ఉండేవని అంచనా. రక్షా బంధన్ మొత్తం షోలలో 60 శాతానికి పైగా మంగళవారం రద్దయ్యాయి. థియేటర్ల రద్దు కౌంట్ రేపు మరింత పెరుగుతుంది.
ఎందుకంటే బుధవారం నాడు కలెక్షన్ల రేంజ్ మరింత తగ్గుతుందని ఎగ్జిబిటర్లు అంచనా వేస్తున్నారు. పార్సీ న్యూ ఇయర్ కారణంగా మంగళవారం నాడు కలెక్షన్లు కొంత వరకూ ఫర్వాలేదనిపించాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి కారణంగా గురు- శుక్రవారాల్లో (18,.. 19 తేదీల్లో) కూడా సెలవులు అందుబాటులో ఉన్నాయి. అయితే అప్పటికి సినిమా చాలా వరకు థియేటర్ల నుంచి తొలగించేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు.