Begin typing your search above and press return to search.
కటౌట్ కాదు డ్యూడ్..కంటెంట్ తో కొట్టాడు!
By: Tupaki Desk | 13 Feb 2022 1:30 PM GMTమాస్ రాజా రవితేజ కథానాయకుడిగా నటించిన `ఖిలాడి`..యంగ్ హీరో సిద్దు నటించిన `డిజేటిల్లు` ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయి? బాక్సాఫీస్ వద్ద ఏది పైచేయి సాధించే అవకాశం ఉంది అంటే రేసులో జూనియర్ హీరోనే కనిపిస్తున్నాడు.
`ఖిలాడి` చిత్రానికి ఎలాంటి రివ్యూలు వచ్చాయో తెలిసిందే. రొటీన్ కంటెంట్ కావడంతో కామన్ ఆడియన్ సైతం పెదవి విరిచేసాడు. మాస్ రాజా మూసధోరణిని ఇంకా వదిలిపెట్టలేదని మరోసారి విమర్శలు ఎదుర్కున్నారు. తెలుగు రాష్ర్టాల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాకి నెగిటివ్ టాక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది.
అయితే అగ్ర హీరో చిత్రం కావడం..పోటీగా మరో స్టార్ లేకపోవడం కాస్త అనుకూల వాతావరణం కనిపిస్తోంది. మరి డీజే టిల్లు పరిస్థితి ఏంటి? అంటే యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సేఫ్ జోన్ లో ఉన్నాడు. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైన్ తో ప్రేక్షకుల్ని సీటులో కూర్చోబెట్టగలుగుతున్నాడు.
సినిమా సక్సెస్ కి అంతకు మించి కావాల్సింది ఏముంది? పాజటివ్ టాక్ రావడంతో సోమవారం నుంచి థియేటర్ల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే `ఖిలాడి` థియేటర్లని కోల్పోక తప్పదు.
అయితే మాస్ రాజాకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఓ సెక్షన్ ఆడియన్స్ ని మెప్పించగలరు. బీసీ సెంటర్లలో `ఖిలాడి` బండి లాగించేయోచ్చు అన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మరోసారి కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని రుజువు అవుతుతోన్న సన్నివేశం కనిపిస్తోంది. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్న నానుడి అన్నిచోట్ల పనవ్వదని తెలుస్తోందిగా.
కటెంట్ చూసి నమ్మాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇటీవలి కాలంలో కంటెంట్ కి తెలుగు ప్రేక్షకులు వేస్తోన్న పెద్ద పీఠ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ రకంగా యంగ్ హీరో కెరీర్ కి ఈ సినిమా సక్సెస్ పూలబాట వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.