Begin typing your search above and press return to search.
ఖిలాడి.. వీక్ డేస్ లో ఊహించిందే జరిగింది
By: Tupaki Desk | 15 Feb 2022 3:30 PM GMTరవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి అంచనాలు పెంచేలా పబ్లిసిటీ చేశారు. సినిమా విడుదల సమయంలో అంచనాలు పీక్స్ కు చేరాయి. ఇద్దరు హీరోయిన్స్ తో ముద్దు సన్నివేశాలను మొదలుకుని డింపుల్ హయతీ అందాల ఆరబోత వరకు అనేక అంశాలు ఈ సినిమాకు కలిసి వస్తాయని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు.
సినిమా విడుదల తర్వాత ఫలితం తారుమారు అయ్యింది. సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో మొదటి రోజు వసూళ్లు బాగానే వచ్చాయి. కాని నెగటివ్ రివ్యూలు మరియు పబ్లిక్ టాక్ కారణంగా వసూళ్లు వెంటనే డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా భావించాడు. అయితే శని ఆదివారాలు కూడా ఒక మోస్తరుగా వసూళ్లు నమోదు అయ్యాయి. కాని సోమవారం నాడు మాత్రం ఖిలాడి వసూళ్లు మరీ తక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది.
సాదారణంగానే వీక్ డేస్ లో వసూళ్లు తక్కువగా ఉంటాయి. అలాంటిది ఖిలాడి సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో వసూళ్లు మరింత తక్కువగా ఉంటాయని అంతా భావించారు. అంతా ఊహించినట్లుగానే ఖిలాడి సినిమాకు వీక్ డేస్ లో సాధారణం కంటే మరీ తక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ వారం వరకు ఖిలాడి సినిమా థియేటర్లలో కొనసాగడం కష్టంగా ఉందంటున్నారు. వచ్చే వీకెండ్ కు ఏమైనా మళ్లీ సత్తా చాటుతుందా అనేది చూడాలి.
రవితేజ మరియు హీరోయిన్స్ నటన మరియు పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. కాని దర్శకుడు కథ ను తీసుకున్న విధానం దాన్ని చూపించిన తీరు ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. కథ ను తిప్పి తిప్పి... అన్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రవితేజ ఇలాంటి సినిమాలను కమిట్ అవ్వకుంటే బెటర్ అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
మరో వైపు ఖిలాడి సినిమా విడుదల అయిన ఒక్క రోజు తర్వాత విడుదల అయిన డీజే టిల్లు సినిమా వసూళ్ల విషయంలో దూసుకు పోతుంది. టిల్లు గాడి సందడి అంతా ఇంతా లేదు. వీక్ డేస్ లో కూడా టిల్లు హడావుడి కొనసాగుతూనే ఉంది. మరో వీకెండ్ లో ఈ సినిమా భారీగా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అంతా నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమీ లేవు కనుక ఖిలాడికి కాస్త పాజిటివ్ టాక్ వస్తే డీజే టిల్లు మాదిరిగా మంచి వసూళ్లు దక్కించుకునేది.
దర్శకుడు రమేష్ వర్మతో గతంలోనే రవితేజ వీర సినిమాను చేశాడు. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా మరో అవకాశం ను రవితేజ ఇచ్చాడు. ఈసారి కూడా ఆయన నిరాశ పర్చాడు. రవితేజ ఈ సినిమా ప్లాప్ అయినా ముందు ముందు రాబోతున్న సినిమాలు ఆయనకు మళ్లీ తిరిగి సక్సెస్ ను కట్టబెట్టడం ఖాయం. కాని దర్శకుడు రమేష్ వర్మ మరో సినిమాకు హీరో కోసం వెతుక్కోవాల్సి రావచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.