Begin typing your search above and press return to search.

మ‌హేష్ కోసం `ఖిలాడి` భామ‌ల కొట్లాట‌!

By:  Tupaki Desk   |   11 Feb 2022 7:30 AM GMT
మ‌హేష్ కోసం `ఖిలాడి` భామ‌ల కొట్లాట‌!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయకుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌హేష్ కి జోడీగా మెయిన్ లీడ్ లో పూజాహేగ్డేని ఎంపిక చేసారు. అయితే స్ర్కిప్ట్ సెకెండ్ లీడ్ హీరోయిన్ ని కూడా డిమాండ్ చేస్తోంది. దీంతో ఆ పాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త క‌నిపిస్తుంది.

ఈ నేప‌థ్యంలో మ‌ల‌యాళం బ్యూటీ సంయుక్తా మీన‌న్ ని లాక్ చేసే ప్లాన్ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగింది గానీ...ఇంకా ఖ‌రారు కాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ రేసులోకి `ఖిలాడి` భామ‌లు దిగారు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `ఖిలాడి`లో డింపుల్ హ‌య‌తి...మీనాక్షి చౌద‌రి హీరోయిన్ల‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో భామ‌లు పోటీ ప‌డి న‌టించారు. మాస్ రాజాతో రొమాంటిక్ స‌న్నివేశాల్లో ఓ రేంజ్ లో చెల‌రేగార‌ని ట్రైల‌ర్ చూస్తేనే తెలుస్తోంది. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లోనూ భామ‌లిద్ద‌రూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. త‌మ‌దైన శైలిలో మీడియా స‌హా ఆడియ‌న్స్ అటెన్ష‌న్ డ్రా చేసారు.

ఇప్పుడీ వేగ‌మే మ‌హేష్ సినిమావైపు ఇద్ద‌రి భామ‌ల్ని న‌డిస్తుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. హారికా హాసిని క్రియేష‌న్స్ ఇద్ద‌రి భామ‌ల్లో ఎవ‌రో ఒక‌ర్ని మ‌హేష్ సినిమాలో తీసుకోవాల‌ని భావిస్తున్నారుట‌. దానికి సంబంధించి ద‌ర్శ‌కుడు త్రివ‌క్రిమ్ రెండు మూడు రోజుల్లో ఇద్ద‌రిని ఆఫీస్ కి పిలిపించి మాట్లాడే ప్లాన్ లో ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇదే నిజ‌మైతే ఇద్ద‌రి భామ‌ల మ‌ధ్య గ‌ట్టిపోటీ ఉంటుంది. డింపుల్ హ‌య‌తి..మీనాక్షి ఇప్పుడిప్పుడే ఫోక‌స్ అవుతున్నారు. టాలీవుడ్ లో స‌క్సెస్ అవ్వాల‌ని కెరీర్ ప్లాన్ చేసుకుని ముందుకు క‌దులుతున్నారు. మీనాక్షి చౌద‌రి చేతిలో `హిట్-2` స‌హా మీడియం రేంజ్ సినిమాలున్నాయి.

డింపుల్ హ‌య‌తి బాగానే ఫోక‌స్ అవుతోంది. ఇదే స‌మ‌యంలో మ‌హేష్ సినిమాలో ఛాన్స్ అందుకోగ‌లిగితే కెరీర్ కి క‌లిసొస్తుంది. టాలీవుడ్ ఆడియ‌న్స్ కి మ‌రింత రీచ్ అవుతున్నారు. ఇక మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మంచి స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. అతి త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.