Begin typing your search above and press return to search.
క్రాక్ మాదిరిగానే ఖిలాడి.. పుకార్లకు చెక్
By: Tupaki Desk | 16 May 2021 5:39 AM GMTరవితేజ.. గోపీచంద్ కాంబినేషన్ లో రూపొంది గత ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన క్రాక్ సినిమా కరోనా కారణంగా చాలా ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్ల ద్వారా క్రాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రాక్ విడుదలకు ముందు ఓటీటీ విడుదల కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఓటీటీ రైట్స్ అమ్మేశారు.. స్ట్రీమింగ్ తేదీని ప్రకటించడమే అంటూ పుకార్లు షికార్లు చేశాయి. రవితేజ కూడా ఓటీటీ రిలీజ్ కు ఓకే అన్నాడని.. నిర్మాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓటీటీ విడుదల అవ్వబోతుంది అంటూ ప్రచారం జరిగింది. ఆ సమయంలో దర్శకుడు గోపీచంద్ మలినేని ఎట్టి పరిస్థితుల్లో సినిమాను థియేటర్ల ద్వారా మాత్రమే విడుదల చేస్తామంటూ ప్రకటించాడు.
దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పినట్లుగానే పరిస్థితులు చక్కబడ్డ తర్వాత క్రాక్ సినిమా ఓటీటీ లో విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. లాక్ డౌన్ తర్వాత మొదటి పెద్ద సక్సెస్ గా క్రాక్ నిలిచింది. గత ఏడాది క్రాక్ విషయంలో వచ్చిన వార్తలే ఇప్పుడు రవితేజ 'ఖిలాడి' సినిమా విషయంలోనూ వస్తున్నాయి. రమేష్ వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న ఖిలాడి సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యిందని.. సినిమా ను థియేటర్ ద్వారా విడుదల చేయాలంటే చాలా సమయం పడుతుంది కనుక ఓటీటీ ద్వారా విడుదలకు మేకర్స్ సిద్దం అవుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా స్పందించారు.
క్రాక్ మాదిరిగానే ఖిలాడి సినిమాను కూడా ఖచ్చితంగా థియేటర్ల ద్వారానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ ఫుల్ క్లారిటీగా చెప్పేశారు. థియేటర్లు ఎప్పటిని సాదారణ స్థితికి వచ్చి రన్ అవుతాయో అప్పుడే ఈ సినిమాను విడుదల చేస్తామని ఖిలాడీ మేకర్స్ అధికారికంగా ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దంటూ మేకర్స్ విజ్ఞప్తి చేశారు. సినిమా కోసం దర్శకుడు రమేష్ వర్మ ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ తెరకెక్కిస్తున్నాడు. తప్పకుండా ఇది మాస్ రాజా అభిమానులకు మరో సూపర్ హిట్ ను ఇస్తుందని వారు నమ్మకంగా చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో రవితేజ కు జోడీగా మీనాక్షి చౌదరి.. డింపుల్ హయతి లు హీరోయిన్స్ గా నటించగా జబర్దస్త్ యాంకర్ అనసూయ కీలక పాత్రలో కనిపించబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.