Begin typing your search above and press return to search.
#ఖిలాడీ.. చుట్టూ రెడ్ జోన్ హై అలెర్ట్ .. టీమ్ లో ఒకరికి కరోనా.. అయినా ఆపలేదు!
By: Tupaki Desk | 30 March 2021 7:30 AM GMTచుట్టూ ఎటు చూసినా రెడ్ జోన్ .. అంతా కర్ఫ్యూ వాతావరణం.. పైగా టీమ్ లో ఒకరికి కరోనా.. అయినా షూటింగ్ ఆపలేదు! యథావిధిగా అనుకున్న ప్రకారం షెడ్యూల్ పూర్తి చేశారు. అది కూడా విదేశాల్లో. తిరిగి సైలెంటుగా ఇంటికి వచ్చేశారు. ఇలాంటి సాహసాలు ఇంతకుముందు ఎప్పుడూ కనీ వినీ ఎరుగనివి. కరోనా మహమ్మారీ తోనే మనిషి కాపురం చేయాలని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే ఇప్పుడు సినిమా షూటింగులు పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది.
గత కొంతకాలంగా ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఖిలాడీ టీమ్ నుంచి తెలిసిన తాజా సంగతి అవాక్కయ్యేలా చేస్తోంది. నిజానికి ఇటలీ షెడ్యూల్ ని మార్చి 31 లోగా పూర్తి చేయాల్సి ఉండగా.. మార్చి 26 నాటికే షెడ్యూల్ పూర్తి చేసేశారు. అంటే ఐదు రోజుల ముందే పని పూర్తయ్యేలా స్పీడప్ చేశారు. అక్కడ అనూహ్యంగా లాక్ డౌన్ వేయడం.. లిమిటేషన్స్ కారణంగా షూట్ పూర్తి చేయకుండా యూనిట్ తిరిగి వచ్చేసిందని తాజాగా సందేహాలు వ్యక్తమయ్యాయి.
కానీప్రణాళిక ప్రకారం షెడ్యూల్ మొత్తం పూర్తయిందని దర్శకుడు రమేష్ వర్మ చెబుతున్నారు. ఇటలీలో లాక్ డౌన్ విధించడంతో.. బహిరంగ ప్రదేశాలు పూర్తిగా మూసివేశారు. స్థానిక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఈ క్లిష్ఠ సమయంలో షూటింగ్ చేయడం సవాల్ గా మారిందని రమేష్ వర్మ తెలిపారు.
నిజానికి అక్కడ రెడ్ జోన్లలో ఖిలాడీ చిత్రీకరణ సాగింది. యూనిట్ సభ్యులలో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అతడు స్వీయనిర్బంధంలో ఉన్నాడు. ఈ షెడ్యూల్ లో ఒక పాటతో పాటు యాక్షన్ చేజ్ లు.. కీలకమైన సన్నివేశాలను ఇటలీలో పూర్తి చేశారు. షెడ్యూల్ కోసం నిర్మాతలు రాజీకి రాకుండా రూ .8 కోట్లు ఖర్చు చేశారట. మొత్తానికి షెడ్యూల్ ముగించి యూనిట్ మొత్తం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంది. చివరి పాటను త్వరలో దుబాయ్‌లో చిత్రీకరిస్తారు. ఖిలాడిని మే 28 న విడుదల చేయనున్నారు. మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం ఈ సినిమాలో రక్తి కట్టించనుందని తెలిసింది.