Begin typing your search above and press return to search.
అట్టా సూడకే'.. 'ఖిలాడి' లోని పెప్పీ డ్యాన్స్ నంబర్..!
By: Tupaki Desk | 31 Dec 2021 6:16 AM GMTమాస్ మహారాజా రవితేజ హీరోగా 'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''ఖిలాడి''. రవితేజ ద్విపాత్రాభినయం పోషిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో మీనాక్షి చౌదరి - డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. కొత్త సంవత్సరం కానుకగా తాజాగా ''అట్టా సూడకే'' అనే థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు.
ఇప్పటికే విడుదలైన 'ఖిలాడి' చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు - రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు "అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే.. ఒంట్లో వేడికే పిచ్చెక్కుతాంది నాడికే" అంటూ సాగిన ఈ పాట కూడా అలరిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్ కు ట్యూన్ కంపోజ్ చేశారు. అంతేకాదు సింగర్ సమీరా భరద్వాజ్ తో కలిసి స్వయంగా ఆలపించారు. దీనికి లిరిసిస్ట్ శ్రీమణి మాస్ ఆడియన్స్ కి నచ్చేలా సాహిత్యం రాశారు.
'అట్టా సూడకే' పాటలో రవితేజ - మీనాక్షి చౌదరీ ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులు అదరగొట్టేశారు. శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశారు. సుజిత్ వాసుదేవ్ మరియు జి.కె. విష్ణు 'ఖిలాడి' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అమర్ రెడ్డి ఎడిటర్ గా వర్క్ చేశారు. డీఎస్పీ తమ్ముడు సాగర్ - శ్రీకాంత్ విస్సా కలసి డైలాగ్స్ రాయగా.. రామ్-లక్ష్మణ్ మరియు అన్బు-అరివు మాస్టర్స్ ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.
''ఖిలాడి'' చిత్రాన్ని జయంతీలాల్ గడ పెన్ స్టూడియోస్ - కాంచన కోనేరు సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ - ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై సత్యనారాయణ కోనేరు నిర్మించారు. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ - ఉన్ని ముకుందన్ - అనసూయ - ముఖేష్ రుషి - వెన్నెల కిషోర్ - రావు రమేష్ - మురళీ శర్మ - నికితిన్ ధీర్ - ఠాకూర్ అనూప్ సింగ్ - సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.