Begin typing your search above and press return to search.
'ఖిలాడీ' సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..?
By: Tupaki Desk | 9 Feb 2022 10:30 AM GMTమాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఖిలాడి''. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎల్లుండి (ఫిబ్రవరి 11) ఈ సినిమా తెలుగు హిందీ భాషల్లో విడుదల కానుంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
'ఖిలాడీ' చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు 'U/A' (యు/ఎ) సర్టిఫికెట్ జారీ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. సినిమా రన్ టైం 154 నిముషాలు ( 2 గం. 34 ని) వచ్చినట్లు తెలిపారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
బాలీవుడ్ ప్రొడ్యూసర్ జయంతీలాల్ గడ (పెన్ స్టూడియోస్) సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ - ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ‘ఖిలాడి’ టీజర్ మరియు థియేట్రికల్ ట్రైలర్ లకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
'క్రాక్' తర్వాత రవితేజ నుంచి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్ మరియు జి.కె. విష్ణు వంటి ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చేసారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అమర్ రెడ్డి ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు.
ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ - ఉన్ని ముకుందన్ - అనసూయ భరద్వాజ్ - ముఖేష్ రుషి - వెన్నెల కిషోర్ - రావు రమేష్ - మురళీ శర్మ - నికితిన్ ధీర్ - ఠాకూర్ అనూప్ సింగ్ - సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషించారు.