Begin typing your search above and press return to search.
ఏపీ పరిస్థితులపై టెన్షన్ లేదన్న 'ఖిలాడి'
By: Tupaki Desk | 7 Feb 2022 4:35 AM GMTరవితేజ హీరోగా డింపుల్ హయతీ హీరోయిన్ గా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి సినిమా ఈనెల 11న విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఈ సినిమా ను ఉత్తర భారతంలో హిందీ లో డబ్ చేసి విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.
ఈమద్య కాలంలో సౌత్ సినిమా లపై అధికంగా దృష్టి పెట్టి అక్కడ డబ్ చేయడం రీమేక్ చేయడం చేస్తున్న పెన్ స్టూడియో వారు ఖిలాడి సినిమాను హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే హిందీ డబ్బింగ్ వ్యవహారాలు కూడా పూర్తి అయ్యాయి అంటూ ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఈనెల 11న విడుదల ఖాయం అంటూ మేకర్స్ చెబుతున్నా కూడా మీడియా వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో మాత్రం ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది.. టికెట్ల విషయంలో క్లారిటీ రాలేదు.. దానికి తోడు రవితేజ ఈ సినిమా కు ఇంకా డబ్బింగ్ పూర్తి చేయలేదు అంటూ ఇటీవలే కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. దాంతో ఖిలాడి సినిమా వారం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందనే వార్తలు మొదలు అయ్యాయి.
ఖిలాడి సినిమా విడుదల విషయంలో నెలకొన్న గందరగోళంను చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా ప్రమోషనల్ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా విడుదల విషయంలో మరో ఆలోచన ఏమీ లేదని తేల్చి చెప్పారు. 11వ తారీకున పక్కాగా విడుదల చేస్తామన్నారు. ఏపీలో నైట్ కర్ఫ్యూ ను కాస్త కుదించడంతో షో లకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నాము.
విడుదల అయిన రెండు మూడు రోజుల తర్వాత నైట్ కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ తర్వాత నుండి థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ అవుతాయి. ఇక టికెట్ల రేట్ల విషయమై కూడా పెద్దగా పట్టింపు లేదు అన్నట్లుగా ఖిలాడి మేకర్స్ చెప్పుకొచ్చారు. ఒక వేళ సినిమా థియేటర్ల టికెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వం ఓకే చెప్తే రెండవ వారంలో అయినా మంచి వసూళ్లు నమోదు అవుతాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో ఉన్న పరిస్థితులతో చాలా సినిమాలు వాయిదాలు పడుతున్న సమయంలో ఖిలాడి మాత్రం పెద్దగా టెన్షన్ లేదు అన్నట్లుగా విడుదలకు సిద్దం అయ్యాడు.
కరోనా కారణంగా ఇప్పటికే ఆలస్యం అయిన ఖిలాడి సినిమా ను ఇంకా వాయిదా వేయడం కూడా మంచిది కాదు అనే ఉద్దేశ్యంతో యూనిట్ సభ్యులు ఉన్నారు. సినిమా పై మంచి బజ్ ఉంది. అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
ఈ సినిమా బాలీవుడ్ విడుదల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఖిలాడి హిందీలో విడుదల అయిన తర్వాత రెండు మూడు వారాల పాటు పెద్ద సినిమాలు ఏమీ లేవు. కనుక అప్పటి వరకు పుష్ప సినిమాను ఎలా అయితే చూశారో.. ఖిలాడి సినిమాను కూడా అలాగే చూస్తారనే నమ్మకంతో ఖిలాడి మేకర్స్ ఉన్నారు. ఖిలాడి సినిమా అక్కడ పాతిక కోట్ల టార్గెట్ తో విడుదల చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒక వేళ ఖిలాడి సినిమా అక్కడ పాతిక కోట్లు రాబడితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను నమోదు చేయడం ఖాయం. మొత్తానికి ఖిలాడికి కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కువ కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.