Begin typing your search above and press return to search.

ఖిలాడి.. డైరెక్టర్‌ కి పదేళ్ల క్రితం ఫలితమే పునరావృతం

By:  Tupaki Desk   |   14 Feb 2022 3:58 AM GMT
ఖిలాడి.. డైరెక్టర్‌ కి పదేళ్ల క్రితం ఫలితమే పునరావృతం
X
రవితేజ హీరోగా డింపుల్‌ హయతీ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి సినిమా కు మంచి హైప్‌ ను తీసుకు రావడంలో మేకర్స్ సఫలం అయ్యారు. హీరోయిన్స్ స్కిన్‌ షో తో పాటు రవితేజ మాస్ డైలాగ్స్ ఇంకా పాటలు ఇలా సినిమా విడుదల కు ముందు హడావుడి అంతా ఇంతా కాదు.

దాంతో రమేష్ వర్మ దర్శకత్వం అనే విషయాన్ని మర్చి పోయి రవితేజ పై నమ్మకంతో మరియు హీరోయిన్స్ గ్లామర్ ఇంకా సినిమాకు వచ్చిన బజ్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా అయ్యింది. థర్డ్‌ వేవ్ తర్వాత రాబోతున్న మొదటి సినిమా అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. థియేటర్లకు క్యూ కట్టి ఖిలాడికి కాసుల వర్షం కురిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీకి ప్రతి ఒక్కరు భావించారు. కాని ఫలితం తారు మారు అయ్యింది. భారీ నమ్మకం పెట్టి సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు బలి అయ్యారనే టాక్‌ వినిపిస్తుంది.

ఖిలాడి సినిమాకు వచ్చిన నెగటివ్‌ టాక్ తో వసూళ్ల విషయంలో తీవ్ర నిరాశ తప్పలేదు. మినిమం వసూళ్లు కూడా నమోదు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్ల నుండి సినిమాను తొలగిస్తున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద సినిమాలు లేవు.. పోటీ కూడా పెద్దగా లేదు కనుక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తర భారతంలో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. కాని విడుదల అయిన మూడు రోజుల్లోనే 40 శాతం థియేటర్ల నుండి ఖిలాడి బయటకు వచ్చేశాడట.

తెలుగు రాష్ట్రాల్లో ఖిలాడి కి పోటీగా వచ్చిన డీజే టిల్లు సినిమా కు థియేటర్లు పెరుగుతున్నాయి. ఆ సినిమాకు వచ్చిన పాజిటివ్‌ రెస్పాన్స్ వల్ల ఖిలాడి సినిమాను జనాలు పట్టించుకోవడం లేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకుంటూ డీజే టిల్లు దూసుకు పోతుంటే ఖిలాడి మాత్రం దారుణమైన పరాజయం ను మూట కట్టుకోవాల్సి వచ్చింది.

రవితేజ మరియు రమేష్ వర్మ కాంబోలో దాదాపు పదేళ్ల క్రితం వీర సినిమా వచ్చింది. ఆ సినిమాలో రవితేజకు జోడీగా కాజల్‌ మరియు తాప్సిలు నటించారు. ఇంకా ఆ సినిమాలో భారీ తారాగణం నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. ఆ సమయంలో రవితేజ జోరు కొనసాగుతుంది. కనుక వీర సినిమా ఖచ్చితంగా భారీ వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అనే టాక్ దక్కించుకుంది. వీర సినిమా తర్వాత రమేష్ వర్మ స్థాయి అమాంతం పెరగడం ఖాయం అంటూ అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా వీర సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మెల్ల మెల్లగా రమేష్ వర్మ కెరీర్ ను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు.

మళ్లీ పదేళ్ల తర్వాత రవితేజ తో సినిమా చేసి సక్సెస్ దక్కించుకుని స్టార్ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారాలని భావించాడు. కాని వీర సినిమా ఫలితమే ఖిలాడికి కూడా పునరావృతం అవ్వడంతో రమేష్‌ వర్మ కు టాలీవుడ్‌ లో మరే యంగ్‌ హీరో కాని ఇతర హీరోలు ఇప్పట్లో డేట్లు ఇచ్చే అవకాశం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రమేష్ వర్మ కెరీర్‌ ఆరంభం నుండి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆయన మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తూ కెరీర్ లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా మరియు రచయితగా కూడా తన కెరీర్‌ ను రమేష్ వర్మ కొనసాగిస్తున్నాడు. కనుక మళ్లీ చిన్న సినిమాలతో మొదలు పెట్టి పెద్ద సక్సెస్‌ లను అందుకునేందుకు రమేష్ వర్మ ప్రయత్నాలు చేసే అవకాశాలు లేకపోలేదు.