Begin typing your search above and press return to search.
ఫ్యాషన్ కేపిటల్ లో దేశీ టచ్..
By: Tupaki Desk | 24 Nov 2016 5:37 AM GMTప్రపంచానికి ఫ్యాషన్ నేర్పించడంలో పారిస్ పాత్ర చాలానే ఉంటుంది. ఇప్పుడంటే చాలా సిటీస్ ఈ రేసులో ఉన్నాయ్ కానీ.. ఈ విషయంలో పారిస్ కి ఉన్న హిస్టరీ వేటికీ ఉండదనే చెప్పాలి. అలాంటి సిటీలో నడిచే స్టోరీతో తీసిన బాలీవుడ్ మూవీనే బేఫికర్. కేర్ ఫ్రీ లవ్ అంటూ తెగ ప్రమోట్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి.
కొన్ని నెలల ముందు నుంచే ప్లాన్ చేసి ప్రమోట్ చేయడం ఈ మూవీ బాగా కలిసొస్తోంది. ఇప్పుడు 'ఖుల్ కే డుల్కే' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట మొత్తం పారిస్ వీధుల్లోనే తీయడం విశేషం. ఎప్పటి లాగానే రణవీర్ సింగ్.. వాణి కపూర్ లు ఇరగదీసేశారు. డ్యాన్సులతో.. ఆఖర్లో లిప్ లాక్ తో బాగా ఆకట్టుకున్నారు. కానీ పూర్తిగా పారిస్ లో.. ఆ నగర అందాల మధ్య.. అక్కడి భామలతో తీసిన ఈ పాటకు ఇండియన్ టచ్ ఇవ్వడం విశేషం.
పూర్తిగా భాంగ్రా డ్యాన్సులతో 'ఖుల్కే డుల్కే' పాట సాగుతుంది. మ్యూజిక్ విపరీతంగా ఆకట్టుకోవడం ఈ పాటకు ప్లస్ పాయింట్. ఇక విదేశీ భామలకు చిట్టి పొట్టి డ్రస్సులు వేసి.. దేశీ డ్యాన్సులు చేయిస్తుంటే.. విజువల్స్ అదిరిపోయాయనే చెప్పాలి. డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న బేఫికర్ మూవీలో.. 23లిప్ లాక్ సీన్స్ ఉన్నా సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వడం ఇంకా చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/