Begin typing your search above and press return to search.
హీనాకు ఖుష్బూ కౌంటర్
By: Tupaki Desk | 28 Oct 2017 5:56 PM GMTసాధారణంగా అమ్మాయిలను ఏమన్నా ఉరుకుంటారేమో గాని అందం మీద కామెంట్ చేస్తే మాత్రం ఎంతటివారైనా ఉరుకోరన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవల బాలీవుడ్ భామ హీనాఖాన్ హీరోయిన్స్ పై చేసిన హీనమైన వ్యాఖ్యలు కూడా సౌత్ ఇండస్ట్రీలో మెల్ల మెల్లగా లావాలా ఉప్పొంగుతోంది. బాలీవుడ్ బిగ్ బాస్ షోలో నటి హీనా సౌత్ హీరోయిన్స్ అతిగా ఎక్స్‌పోజింగ్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
దీంతో ఆమె చేసిన కామెంట్స్ కు సోషల్ మీడియాలో పలు కౌంటర్లకు దారితీస్తున్నాయి. ఇప్పటికే పలువురు నటీమణులు కామెంట్ చేసినా మరికొంత మంది హీరోయిన్స్ ఎందుకులే అని సైలెంట్ గా లైట్ తీసుకుంటున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా సీనియర్ నటి కుష్బూ ఈ విషయం పై స్పందించారు. అసలు గౌరవంగా ఎలా ఉండాలో సౌత్ హీరోయిన్స్ ను చూసి నేర్చుకోవాలని కాస్త గట్టిగానే కౌంటర్ వేశారు.
నార్త్ హీరోయిన్స్ ఎక్కడున్న వారు అక్కడే ఉంటున్నారు. కానీ సౌత్ హీరోయిన్స్ మంచి టాలెంట్ తో ముందుకు దూసుకుపోతున్నారు. దక్షిణాది భామలనుంచి మీరు ఇంకా చాలా నేర్చుకోవాలని ఆమె తన ట్విట్టర్ ద్వారా హీనా ఖాన్ కి గట్టిగా కౌంటర్ వేశారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం చాలా వైరల్ అవుతోంది. హీనా అలా మాట్లాడి ఉండకూడదని నార్త్ సైడ్ వారు కూడా కామెంట్ చేస్తున్నారు.