Begin typing your search above and press return to search.
శ్రీదేవి చిన్న కూతురు ఒక నిర్ణయానికి వచ్చింది
By: Tupaki Desk | 10 April 2019 11:14 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి తన పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా చూడాలనుకుంది. ఆమె ఉండగానే జాన్వీ మొదటి సినిమా ప్రారంభం అయ్యింది. కాని విడుదల మాత్రం కాలేదు. వెండి తెరపై కూతురు జాన్వీ కపూర్ ను శ్రీదేవి చూసుకోలేక పోయింది. తన తల్లి ఆశీర్వాదంతో జాన్వీ కపూర్ బాగానే అవకాశాలు రాబట్టుకుంటుంది. మొదటి సినిమా సాదా సీదాగా ఆడినా కూడా కరణ్ జోహార్ సాయంతో పెద్ద సినిమాల్లో నటిస్తూ ఉంది. ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా తన కెరీర్ పట్ల ఒక నిర్ణయానికి వచ్చేసింది.
ఖుషి కపూర్ మొన్నటి వరకు మోడలింగ్ పై ఆసక్తిని కనబర్చింది. మోడలింగ్ బిజినెస్ చేయాలని భావించిందట. కాని తాజాగా ఆమె సినిమాల వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకుందని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. తాజాగా ఒకానొక సందర్బంలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ మోడలింగ్ మరియు సినిమా రంగాల్లో దేన్ని ఎంచుకోవాలో తెలియక ఖుషి చాలా మదన పడింది. చివరకు సినిమా రంగంలో తన అదృష్టంను పరీక్షించుకునేందుకు సిద్దం అయ్యింది. అందుకోసం నటనలో శిక్షణ తీసుకునేందుకు అమెరికా వెళ్లాలని ఖుషి నిర్ణయించుకుంది.
అమెరికాలో సినిమాకు సంబంధించిన పలు విభాల గురించి ట్రైనింగ్ తీసుకుని, ఆ తర్వాత వచ్చి నటిస్తుందని జాన్వీ చెప్పుకొచ్చింది. అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పగానే నేను, నాన్న ఆందోళన చెందాం. కెరీర్ లో ముందుకు వెళ్లాలి అంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవు. కాని ఖుషి మమ్ముల్ని వదిలేసి అమెరికా వెళ్లాలి అనగానే నాన్న కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఖుషి నాకు చెల్లి మాత్రమే కాకుండా మంచి స్నేహితురాలు కూడా, ఇద్దరం పలు విషయాలకు గొడవ పడ్డా ఫైనల్ గా వెంటనే మళ్లీ కలిసి పోతాం అంటూ చెల్లితో తన అనుబంధంను, చెల్లి కెరీర్ ప్లాన్స్ ను జాన్వీ చెప్పుకొచ్చింది.