Begin typing your search above and press return to search.
న్యూ ఇయర్ కానుకగా థియేటర్లలో 'ఖుషీ' హంగామా!
By: Tupaki Desk | 26 Dec 2022 11:20 AM GMTటాలీవుడ్ లో రీ-రిలీజ్ లు ట్రెండ్ గా మారిన సంగతి తెలిసిందే. ఓల్డ్ క్లాసిక్ హిట్స్ అన్నింటిని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 4కే అప్డేట్ వెర్షన్ లో రీలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారు. 'పోకిరి' సినిమాతో ఈ ట్రెండ్ మెుదలైంది. అటుపై మెగా హీరోల పలు సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి.
'తమ్ముడు.'. 'జల్సా' ఇప్పటికే రీ-రిలీజ్ అయ్యాయి. ఆ రెండు కూడా మంచి కలెక్షన్స్ సాధించాయి. ఈనేపథ్యంలో అభిమానుల కోరిక మేరకు బ్లాక్ బస్టర్ ఖుషీ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
4కెలో ఈచిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. జనవరి 6వరకూ థియేటర్లో ఉంటుంది. ఇప్పటికే దీనికి 4కె వెర్షన్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది.
ఈ సినిమా రీ -రిలీజ్ థియేట్రికల్ రైట్స్ మూడు కోట్ల వరకు అమ్ముడు పోయినట్టుగా సమాచారం. 2001లో 'ఖుషీ' రిలీజ్ అయింది. అప్పట్లో ఓ క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ మీద ఏ.ఎం రత్నం సినిమాను నిర్మించారు. ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించారు. ఇప్పుడు 4కే రిజల్యూషన్ లో 5.1 డాల్బీ ఆడియో క్వాలిటీతో రిలీజ్ అవుతుంది.
వింటేజ్ పవర్ స్టార్ ను చూసేందుకు ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. భూమిక నడుం..ఒంపు సొంపుల సన్నివేశం గురించైతే చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో అదో ట్రెండ్ సెట్టర్ సీన్. ఇప్పటితరాన్ని సైతం తప్పక మెప్పిస్తుంది.
రిలీజ్ తర్వాత ఆ సీన్ గురించి డిస్కషన్స్ సాగడం ఖాయం. 'హరి హర వీరమల్లు' రిలీజ్ ఆలస్యమైనా పీకే రీ-రిలీజ్ లతో అభిమానులకు టచ్ లోఉంటున్నాడు. ఓ రకంగా పవన్ కిది పాజిటివ్ సైన్ అనే చెప్పాలి. ఇంకా బాలయ్య 'చెన్నకేశవ రెడ్డి'.. ప్రభాస్ 'వర్షం' సినిమాలు కూడా రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.