Begin typing your search above and press return to search.
కీ అండ్ కా... కాదులే కేక..
By: Tupaki Desk | 1 April 2016 11:30 AM GMTకీ అండ్ కా అనే టైటిల్ పై సినిమా చేస్తున్నానని దర్శకుడు ఆర్. బాల్కీ ప్రకటించినపుడే ఈ మూవీపై అంచనాలు మొదలయ్యాయి. లడకీ అండ్ లడకా అని దీనికి అర్ధం అని డీటైలింగ్ ఇచ్చినా.. ఇప్పుడు సినిమాలో మరో అర్ధం కూడా దీనికి ఉంది. ఇవాళే విడుదలైన ఈ చిత్రంలో పాత్రల పేర్లే కి అండ్ కా. కి అంటే హీరోయిన్ పేరు కియా - క అంటే హీరో పేరు కబీర్. ఈ కీ అండ్ కా చిత్రం బాలీవుడ్ లో సంచలనాలు సృష్టిస్తుందనే అంచనాల మధ్య విడుదలైనా.. అంత సీన్ లేదంటున్నారు ఆడియన్స్.
పెళ్లాం అంటే ఇంట్లో ఉండాలి, మొగడంటే ఆఫీస్ కి వెళ్లాలి అనే కాన్సెప్ట్ కి డిఫరెంట్ గా తెరకెక్కించిన ఈ మూవీపై.. బాలీవుడ్ లో మిక్సెడ్ టాక్ మొదలైంది. హీరో కేరక్టరైజేషన్ బాగుందని, ఫస్టాఫ్ అద్భుతంగా ఉన్నా.. సెకండాఫ్ మాత్రం దర్శకుడు ఆకట్టుకోలేక పోయాడు. ముఖ్యంగా హీరోయిన్ పాత్రను డిజైన్ చేయడంలో లోపాలు
ఎక్కువగానే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.
సినిమా కథంతా కియా - కబీర్ ల మధ్యే తిరుగుతుంది. భర్త ఇంట్లో ఉండి వంటావార్పు చేసేలా ఒప్పందం కుదిరి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత అనుకోని సమస్యలు వచ్చి వీరి మధ్య విబేధాలు మొదలవుతాయి. వీటిని ఎలా పరిష్కరించుకున్నారన్నదే కీ అండ్ కా. సినిమాలో అమితాబ్ బచ్చన్ - జయా బచ్చన్ ల పాత్రలతో ఇచ్చిన సర్ ప్రయిజ్ - వారి సంభాషణలు బాగున్నా... మొత్తం మీద యావరేజ్ మూవీగా మిగిలిపోయే అవకాశాలున్నాయని బాలీవుడ్ టాక్.