Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: కిక్కిస్తున్న కియారా!

By:  Tupaki Desk   |   30 July 2018 6:09 AM GMT
ఫోటో స్టొరీ: కిక్కిస్తున్న కియారా!
X
ఫ్యాషన్ కు సినిమాకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఈమధ్య కాలంలో అదింకా ఎక్కువైంది కూడా. హీరోయిన్ల విషయమే తీసుకుంటే ఎక్కువమంది మోడలింగ్ నేపథ్యం నుండి వచ్చిన వారే. ఒకవేళ అలా కాకుండా డైరెక్ట్ గా సినిమాల్లోకే ఎంట్రీ ఇచ్చినా అప్పుడప్పుడూ రాంప్ వాక్స్ లో తళుక్కున మెరుస్తారు. మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని సెకండ్ కేటగిరీ.

డైరెక్ట్ గా 'ఫగ్లీ' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన సెకండ్ ఫిలిం 'MS ధోని' తో మంచి మంచి పాపులారిటీ సాధించింది. ఇప్పుడు కియారాకు తెలుగు లో కూడా సూపర్ పాపులారిటీ ఉంది. ఈ భామ అప్పుడప్పుడూ ఫాషన్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటుంది. ఈమధ్యనే ఢిల్లీ లో జరిగిన ఇండియా కూచర్ వీక్ ఈవెంట్ లో ఇతర అందమైన మోడల్స్ లో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. శ్యామల్ & భూమిక డిజైన్లో ఆహుతుల మతుల్ని పోగొట్టింది. లేత ఆకుపచ్చ రంగు లెహెంగాలో దానికి మ్యాచ్ అయ్యే నెక్లెస్ తో కాన్ఫిడెంట్ గా వాక్ చేసింది. ప్రిన్సెస్ లా డ్రెస్ లో ఉన్నా హైలైట్ మాత్రం ఆమె చేసిన అందాల విందే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

అలాంటి బ్యూటీ కాబట్టే కియారా కు సినిమాలు ఫుల్లుగా వస్తున్నాయట. కానీ ఈ ముంబై ముద్దుగుమ్మ మాత్రం చాలా జాగ్రత్తగా తన సినిమాలను ఎంచుకుంటోంది. అందులో ఒకటి రామ్ చరణ్- బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం. ఫ్యాషన్ ఈవెంట్ లోనే ఇలా దుమ్ము లేపితే, బోయపాటి మసాలా సినిమాలో పరిస్థితేంటో.. రచ్చ రంబోలానే!