Begin typing your search above and press return to search.
కీయరా బ్యాక్ గ్రౌండ్ స్టొరీ!
By: Tupaki Desk | 29 Oct 2018 2:30 PM GMTసినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ల పెత్తనం ఎలా ఉంటుందో తెలియనిది కాదు. మేకప్ మ్యాన్ విషయం మొదలుకుని కారవాన్ దాకా వాళ్ళు పెట్టే నిబంధనలు కొన్నిసార్లు కోపం తెప్పించే విధంగా ఉంటాయి. కానీ వాళ్లకున్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు భరించక తప్పని పరిస్థితి. కానీ కియారా అద్వానీ కేసు వేరు. మహేష్ బాబు భరత్ అనే నేనులో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ స్వీట్ బ్యూటీ ఆ వెంటనే రామ్ చరణ్ బోయపాటిల సినిమా కూడా తన ఖాతాలో వేసుకుంది. పైన చెప్పిన నిబంధనల విషయంలో కియారా స్టైల్ వేరు.
కెరీర్ ప్రారంభంలో సినిమాలు చేస్తున్న టైంలో హోటల్ రూమ్ తో సహా ఖర్చులన్నీ తనే పెట్టుకునే కియారా తన స్వంత బిఎండబ్ల్యూ 7 సిరీస్ కారులు వచ్చేది కానీ నిర్మాతతో పెట్రోల్ ఖర్చులు కూడా అడిగేది కాదట. ఇదే విషయాన్ని మేనేజర్ ద్వారా నిర్మాతలకు మెసేజ్ చేయిస్తూ తనను తీసుకుంటే ఈ ఖర్చులన్నీ మిగిలిపోతాయి అనే రీతిలో ప్రోమోట్ చేయించుకునేదట. నిజానికి కియారా ఇలా చేయడానికి కారణం ఉంది. తను పుట్టుకతోనే ధనవంతురాలు. ఈషా అంబానీ క్లాస్ మేట్ అంటేనే అర్థం చేసుకోవచ్చు తన స్టేటస్ ఏంటో. తనకున్న సంపదతో పోలిస్తే సినిమాల పారితోషికం అసలు లెక్కలోకే రాదు.
కియారాకు చాలా బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉంది. నాన్న జగ్దీప్ అద్వానీ ప్రముఖ వ్యాపారవేత్త. తల్లి జాఫ్రీ పలు భాషల్లో గొప్ప నైపుణ్యం ఉన్న గొప్ప విద్యావేత్త. కియారా అసలు పేరు అలియా. మొదటిసినిమా ఫగ్లీతోనే పేరు మార్చుకుంది. అది యావరేజ్ అయ్యింది. తర్వాత అబ్బాస్ మస్తాన్ లు తీసిన మెషిన్ పెద్ద డిజాస్టర్. ఆ టైం లో వచ్చిన అవకాశమే భరత్ అనే నేను. అది ఎంత టర్నింగ్ పాయింట్ అయ్యిందో చూసాంగా. రామ్ చరణ్ సినిమా కూడా హిట్ అయితే ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. బాలీవుడ్ సీనియర్ నటులు అశోక్ కుమార్ తనకు తాతయ్య అవుతారు. ప్రముఖ మోడల్ షహీన్ జాఫ్రీతో పాటు మాజీ హీరోయిన్ జుహీ చావ్లాలు కియారాకు అత్తయ్య వరసలు అవుతారు. పైకి కనిపించదు కానీ కియారా వెనుక ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందన్న మాట.