Begin typing your search above and press return to search.

ఆ హీరోలు నాకు సూపర్ బడ్డీస్ అంటున్న బ్యూటీ

By:  Tupaki Desk   |   15 April 2020 10:50 AM GMT
ఆ హీరోలు నాకు సూపర్ బడ్డీస్ అంటున్న బ్యూటీ
X
సూప‌ర్ స్టార్ మహేష్ నటించిన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు సినిమాల్లోకి అరంగేట్రం చేసిన బ్యూటీ కియారా అద్వానీ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌ హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితేనేం.. హిందీలో ఈ భామ 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్‌'లో చూమంత్రం వేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది కియారా.

చాలా కాలం నుండి అనేక తెలుగు చిత్రాల కోసం ఆమెను సంప్రదించినా ఆమె వాటిని తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై కియారా స్పందిస్తూ "తను ఏ తెలుగు సినిమాను ఎప్పుడూ తిరస్కరించలేదని. త్వరలో టాలీవుడ్ లో ఒక పెద్ద సినిమాపై సంతకం చేస్తా"అని కియారా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక తను మహేష్ బాబు - రాంచరణ్ లాంటి స్టార్ హీరోలతో పనిచేయడం గొప్ప అనుభవం ఇచ్చిందని చెప్పింది. మహేష్ బాబు చాలా ఫ్రెండ్లీ సూపర్ స్టార్. రామ్ చరణ్ మంచి బడ్డీ ఫ్రెండ్ అని ఈ సుందరి చెప్పుకొచ్చింది. త్వరలో పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమాకు కియారను సంప్రదిస్తున్నారని తెలుస్తుంది.