Begin typing your search above and press return to search.

గల్ఫ్ మ్యాగజైన్ పై మెరిసిన కియరా

By:  Tupaki Desk   |   12 March 2020 6:30 AM
గల్ఫ్ మ్యాగజైన్ పై మెరిసిన కియరా
X
కియరా అద్వాని క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. నటన.. బోల్డ్ నెస్.. గ్లామర్.. ఫ్యాషన్ అన్నీ ఉండడంతో ప్రస్తుతం బాలీవుడ్ లో హయ్యెస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారిపోయింది. రెగ్యులర్ గా కమర్షియల్ సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లలో వెబ్ ఫిలిమ్స్ లో నటిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. గతంలో లస్ట్ సీరీస్ తో ఒక్కసారిగా అందరినీ ఆకర్షించిన కియారా తాజాగా నెట్ ఫ్లిక్స్ వారి 'గిల్టీ' ఫిలిం తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇదిలా ఉంటే కియరా తాజాగా 'గల్ఫ్ న్యూస్ టాబ్లాయిడ్' అనే మ్యాగజైన్ కవర్ పేజిపై తళుక్కున మెరిసింది. ఈ మ్యాగజైన్ లో కియరా పై 'ఆన్ ట్రయల్' అనే ఒక ఎక్స్ క్లూజివ్ కథనం ప్రచురించారు. ఈ కథనంలో 'గిల్టీ' చిత్రంలో కియరా పోషించిన పాత్ర గురించి కూడా వివరించిందట. ఇక ఫోటోలో ఆఫ్ షోల్డర్ డిజైన్ ఉండే పింక్ షర్టు ధరించి ఓ గ్లామరస్ పోజిచ్చింది. డ్రెస్ లో హాట్ నెస్ తో పాటుగా ఫేస్ లో ఆ చిరునవ్వు డెడ్లీ కాంబినేషన్ లాగా కనిపిస్తోంది.

కియరా ఇండియన్ మ్యాగజైన్ ల కవర్ పేజిలనే కాకుండా ఇలా గల్ఫ్ దేశాలకు చెందిన మ్యాగజైన్లను కూడా కవర్ చేస్తూ ఇంటర్నేషనల్ భామ అనిపించుకుంటోంది. ఇక కియారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'భూల్ భులయ్యా 2'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' సినిమాల్లో నటిస్తోంది.