Begin typing your search above and press return to search.
ఆ ఫ్లాప్ తో మళ్లీ ఆఫర్ వస్తుందనుకోలేదు
By: Tupaki Desk | 2 Dec 2020 1:30 AM GMTబాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ల జాబితాలో కియారా అద్వానీ ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. తెలుగులో కూడా ఈమె రెండు సినిమాలు చేసిన విషయం తెల్సిందే. తెలుగులో ఈమె చేసిన రెండు సినిమాల్లో ఒకటి సూపర్ హిట్ అవ్వగా రెండవది ప్లాప్ గా నిలిచింది. అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఈమెకు క్రేజ్ మాత్రం టాలీవుడ్ ప్రేక్షకుల్లో తగ్గలేదు. అలాగే ఈమె బాలీవుడ్ మొదటి సినిమా కూడా నిరాశ పర్చిందట. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పింది. ఈమె కెరీర్ ఆరంభంలో చేసిన ఒక సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ ఆఫర్ వస్తుందని ఆశించలేదట. కాని అనూహ్యంగా ధోని సినిమా ఆఫర్ రావడంతో ఆమె కెరీర్ మొత్తం మారిపోయింది.
కియారా అద్వానీ మాట్లాడుతూ.. అంతా అనుకుంటున్నట్లుగా నేను ధోని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వలేదు. నేను నటించిన మొదటి సినిమా 2014లో ఫగ్లీ విడుదల అయ్యింది. ఆ సినిమా చాలా మందికి తెలియదు. కాని నేను నటించిన మొదటి సినిమా అది. ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నిరాశ పర్చింది. ఆ సినిమా తర్వాత ఇక నా కెరీర్ ఖతం అనుకున్నాను. మొదటి సినిమాతోనే నేను చివరి సినిమా చేసినట్లయ్యిందని అనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ సినిమాల్లో ప్రయత్నించడం మొదలు పెట్టాను. అనూహ్యంగా ధోని సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ కాస్త నా జీవితాన్ని కెరీర్ ను మార్చేసిందంటూ కియారా పేర్కొంది. కెరీర్ కష్టంలో ఉన్నప్పుడు ప్రయత్నించకుండా ఉంటే నాకు మళ్లీ ఇన్ని ఆఫర్లు వచ్చేవి కాదంటూ కియారా చెప్పుకొచ్చింది.