Begin typing your search above and press return to search.

ఫోటో టాక్: స‌ముద్ర‌ ఆల్చిప్ప‌లో దాగిన‌ట్టుగా!

By:  Tupaki Desk   |   24 Dec 2019 1:39 PM GMT
ఫోటో టాక్: స‌ముద్ర‌ ఆల్చిప్ప‌లో దాగిన‌ట్టుగా!
X
ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ ని ఫాలో చేయ‌డంలో కియ‌రా త‌ర్వాత‌నే. కేవ‌లం నాలుగైదేళ్ల‌లోనే హిందీ- తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని అందుకున్న ఈ బ్యూటీ యూత్ కి చేరువ‌య్యేందుకు నిరంత‌రం ఏదో ఒక ఫ్యాష‌న్ జిమ్మిక్కుతో ట్రీటిస్తూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో కియ‌రా స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ముంబై రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో ఎంద‌రు న‌వ‌త‌రం నాయిక‌లు పోటీప‌డినా.. కియ‌రానే అంద‌రిలో షో స్టాప‌ర్ గా నిలుస్తోంది. రాహుల్ బ‌జాజ్ ఫిలింస్కూల్ లో స్ట‌డీ కానిచ్చి అటుపై ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీతోనూ అనుబంధం సాగిస్తూ కియ‌రా జెట్ స్పీడ్ తో పాపుల‌రైపోయింది.

ఇప్ప‌టికే కియ‌రా ట్రెండీ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాని హుషారెత్తిస్తున్నాయి. తాజాగా ముంబైలో జ‌రిగిన ఓ ఈవెంట్లో కియ‌రా ప్ర‌త్య‌క్ష‌మైన తీరు యూత్ ని స‌మ్మోహ‌నంలో ముంచెత్తింది.
షోల్డ‌ర్ లెస్ .. కుచ్చుల ఫ్రాకులో కియ‌రా స్ట‌న్నింగ్ లుక్ మైమ‌రిపించింది. వైట్ అండ్ పింక్ లుక్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఆ న‌డుము అందాల్ని.. ఎద అందాల్ని మొప్ప‌ల‌తో క‌ప్పిన‌ట్టుగా.. స్పెష‌ల్ డిజైన్ ఆక‌ట్టుకుంది. పండోరా గ్ర‌హంపై వింత‌ మొగ్గ‌లోకి గెంతిందా ఇలా? స‌ముద్ర ఆల్చిప్ప‌లో దాగిందా అలా అన్న‌ట్టుగా.. కియ‌రా లుక్ సంథింగ్ స్పెష‌ల్ గా ఎలివేట్ అయ్యింది. ల‌క్ష్మీ లెహ‌ర్ కియ‌రా స్టైలింగ్ ని డిజైన్ చేశారు.

కియ‌రా కెరీర్ పరంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీ. ఇరుగు పొరుగు భాష‌ల్లో పిలిచి అవ‌కాశం ఇచ్చినా న‌టించేంత తీరిక లేదు త‌న‌కు. 2019 బెస్ట్ ఇయ‌ర్ అనే చెప్పాలి. ఇక 2020లో కియ‌రా న‌టిస్తున్న‌ నాలుగైదు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ల‌క్ష్మీ బాంబ్- గుడ్ న్యూస్ లాంటి చిత్రాల్లో కియరా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్- య‌శ్ రాజ్ పిలింస్ అవ‌కాశాలు త‌న‌కు ఉన్నాయ‌ని తెలుస్తోంది.