Begin typing your search above and press return to search.

పింక్ లో దేశీ గాళ్ గుబులు రేపుతోందిగా

By:  Tupaki Desk   |   17 Feb 2020 11:30 PM GMT
పింక్ లో దేశీ గాళ్ గుబులు రేపుతోందిగా
X
`క‌బీర్ సింగ్` సంచ‌ల‌న విజ‌యం కియ‌రా కెరీర్ కి బిగ్ బూస్ట్ అనే చెప్పాలి. 2020లో వ‌రుస‌గా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది. ఇటీవ‌లే అక్ష‌య్ - దిల్జీత్ దోసాంజి క‌థానాయ‌కులుగా న‌టించిన గుడ్ న్యూజ్ చిత్రంలోనూ కియ‌రా పాత్ర‌కు చ‌క్కని గుర్తింపు ద‌క్కింది. ప్ర‌స్తుతం అక్ష‌య్ స‌హా ప‌లువురు బిగ్ స్టార్స్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఇక కెరీర్ ఎత్తుగ‌డ ఎలా ఉన్నా.. ఈ అమ్మ‌డి ఫోటోషూట్లు సోషల్ మీడియాలో ఓ రేంజులో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా కియ‌రా స్టైల్ కంటెంట్ పై యూత్ ఎక్కువ‌గా ముచ్చ‌టించుకుంటోంది. తాజాగా మ‌నీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పింక్ లెహెంగాలో కియ‌రా లుక్ పరేషాన్ చేసింది. కియ‌రా స్ట‌న్నింగ్ లుక్ బోయ్స్ గుండెల్లో గుబులు రేపింది. ఇది ఆఫ్-డ్యూటీ లుక్ .. పైగా దేశీ లుక్ కావ‌డంతో యూత్ ని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. పింక్ అండ్ ప‌ర్పుల్ క‌ల‌ర్ సాల్ట్ క్రిస్ట‌ల్ డిజైన్.. ఆ బ్లాక్ గ్లాసెస్ కియ‌రాకి ప‌ర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది. ఈ డిజైన‌ర్ లుక్ లో పింక్ హంస దిగొచ్చిందా? అన్నంతగా ఇంప్రెస్ చేసింది.

అన్న‌ట్టు విన‌య విధేయ రామ డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ త‌ర్వాత తిరిగి టాలీవుడ్ వైపు చూడ‌లేదు ఈ అమ్మ‌డు. క‌నీసం చిరు 152లో అయినా చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించేందుకు ఓకే చెప్పిందా? మ‌హేష్ 27కి అయినా క‌మిటైందా లేదా? అంటే ఇప్ప‌టికీ కియ‌రా నుంచి ఎలాంటి స‌మాచారం లేదు. ఓవైపు మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న అవ‌కాశం అంటూ ఓ గుస‌గుస‌ వినిపిస్తోంది. మ‌రి ఇంత‌మంది పిలిచి అవ‌కాశ‌మిచ్చినా కియ‌రా లైన్ క్లియ‌ర్ చేయ‌దేమిటో!