Begin typing your search above and press return to search.
అయోమయంలో కియారా!
By: Tupaki Desk | 4 Nov 2018 4:18 AM GMTటాలీవుడ్ లో అసలే హీరోయిన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అలాంటిది మొదటి సినిమాతోనే వంద కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టి రెండోది అంతకు మించి అనేలా రూపొందుతున్న సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరోయిన్ డిమాండ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. కియారా అద్వానీ పరిస్థితి అచ్చంగా అలాగే ఉంది. భరత్ అనే నేనుతో సక్సెస్ ఫుల్ డెబ్యూ చేసిన కియారా రెండో సినిమా రామ్ చరణ్ వినయ విధేయ రామ(వర్కింగ్ టైటిల్)షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉంది. ఇది పూర్తయ్యాక మూడో తెలుగు సినిమా ఏది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండటం సహజం. కానీ కియారా చూపు మాత్రం బాలీవుడ్ వైపే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చే నెలలో ప్రారంభం కాబోయే మూవీలో తననే తీసుకోవాలనే ప్రతిపాదన ఉందట. కాని డేట్స్ సర్దుబాటు విషయంలో డైలామ ఉండటంతో తన దగ్గరకు వస్తున్న తెలుగు నిర్మాతలను హోల్డ్ లో ఉంచుతున్నట్టు తెలిసింది.
కియారా హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో ఫిమేల్ లీడ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. హీరో షాహిద్ కపూర్ తో ఇటీవలే చేసిన ఊర్వశి ఊర్వశి రీమిక్స్ వీడియో సాంగ్ మంచి స్పందన దక్కించుకున్న నేపథ్యంలో దీనికి మార్గం సుగమమైంది. మరోవైపు అక్షయ్ కుమార్ గుడ్ న్యూస్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. కాస్త ఓపిక పడితే ముగ్గరు ఖాన్లలో ఎవరో ఒకరి సరసన ఆఫర్ రాకపోతుందా అని ఎదురు చూస్తోందట. మరి తెలుగు సినిమాల సంగతేంటి అని అడిగితే నేరుగా బదులు చెప్పడం లేదు. బాలీవుడ్ అంటే అంత ఇష్టం కాబట్టే నటిగా తానేంటో ప్రూవ్ చేసుకోవడం కోసం లస్ట్ స్టోరీస్ లాంటి బోల్డ్ వెబ్ మూవీలో నటించింది కియారా. ఇప్పుడు అక్కడ కెరీర్ గాడిలో పడుతున్న తరుణంలో తెలుగు సినిమాలు ఎక్కువ ఒప్పేసుకుంటే వాటిని మిస్ అవుతానేమో అన్న అయోమయంలో ఉన్నట్టు అక్కడి టాక్. మరి బంగారు బాతులాంటి టాలీవుడ్ మార్కెట్ ని వదులుకుని హిందీకె ప్రాధాన్యత ఇస్తుందా లేక ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుందా వేచి చూడాలి. చరణ్ సినిమా కూడా హిట్ అయితే కియారా డిమాండ్ ఏ రేంజ్ కు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాలా.