Begin typing your search above and press return to search.

మహేష్ హీరోయిన్ చంపేసింది అంటున్నారే

By:  Tupaki Desk   |   15 Jun 2018 9:31 AM IST
మహేష్ హీరోయిన్ చంపేసింది అంటున్నారే
X
భరత్ అనే నేను సినిమాలో సీఎంనే ప్రేమలోకి దింపే మధ్య తరగతి అమ్మాయిలా బాగానే మెప్పించింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. కియారా ఇంతకుముందు చేసిన హిందీ సినిమాల్లోనూ గ్లామర్ ప్రదర్శించాల్సిన అవసరం రాలేదు. అలాంటిది ఏకంగా ఓ అడల్ట్ మూవీలో నటించింది. ఇందులో కియారా తన నటనతో ప్రేక్షకుల గుండెలు కొల్లగొట్టేసిందట.

బాలీవుడ్ లో సినిమాల్లో ప్రయోగంగా చెప్పుకునే విధంగా తాజాగా లస్ట్ స్టోరీ స్ అనే మూవీ విడుదలైంది. అయితే ఇది థియేటర్లకు రాలేదు. ఇది వెబ్ మూవీ. అంటే డబ్బులు చెల్లించి నెట్ ఫ్లిక్స్ లో దీనిని చూడొచ్చు. ఇది మధ్యతరగతి కుటుంబాల్లోని నలుగురు మహిళల మనసులో సెక్స్ పట్ల దాగున్న భావాలకు చిత్రరూపం. ఇందులో కియారాది కొత్తగా పెళ్లయి అత్తవారింట అడుగుపెట్టిన భార్యగా కనిపిస్తుంది. భర్తతో సుఖపడలేక మనసులో మరొకరిని ఊహించుకుంటూ సంఘర్షణతో రగిలిపోతూ కనిపిస్తుంది. ఈ రోల్ లో కియారా అద్భుతంగా నటించింది.

లస్ట్ స్టోరీ స్ లో నలుగురు మహిళల కథలను నలుగురు దర్శకులు డైరెక్షన్ చేశారు. ఇందులో కియారా కథను కరణ్ జోహార్ డైరెక్ట్ చేశాడు. కియారాతోపాటు రాధికా ఆప్టే.. మనీషా కొయిరాలా.. భూమి పెడ్నేకర్ మిగిలిన మూడు పాత్రలు చేశారు. ఇందులో నటనపరంగా కియారాకే ఎక్కువ మార్కులు పడ్డాయి. లస్ట్ స్టోరీలో రెచ్చిపోయి నటించడం కియారాకు మంచిపేరే తీసుకొస్తోంది.