Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: వధువుగా మారిన లస్ట్ భామ

By:  Tupaki Desk   |   9 Jun 2019 4:16 AM GMT
ఫోటో స్టొరీ: వధువుగా మారిన లస్ట్ భామ
X
బాలీవుడ్ లో ఉన్న క్రేజీ బ్యూటీలలో కియారా అద్వాని ఒకరు. 'భరత్ అనే నేను'.. 'వినయ విధేయ రామ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన ఈ భామ ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. దాంతో పాటుగా సోషల్ మీడియాలో హీట్ పెంచడం.. మ్యాగజైన్ కవర్ పేజీలపై అందమైన పోజులిచ్చి చదువరులను చూపరులను తన స్టైల్ తో కట్టిపడేసేలా చేయడాన్ని ఒక హాబీలా పెట్టుకుంది.

సేమ్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ తాజాగా ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ కోసం ఒక పెళ్ళి కూతురులాగా మారిపోయింది.. కలర్ ఫుల్ గా.. రిచ్ గా కనిపిస్తున్న టాప్.. లెహెంగా ధరించి దర్జాగా కూర్చుంది. ఆభరణాలు హెవీగా ధరించి కళ్ళకు బ్లూ కలర్ మేకప్ వేసుకొని చిరునవ్వు రువ్వుతూ ఫోటోకు అందంగా పోజిచ్చింది. జుట్టున్నమ్మకు ఏ కొప్పు అయినా అందంగా ఉంటుందని ఒక నాటు సామెత. అలాగే అందమైన భామ ఏ దుస్తులు వేసుకున్నా అందంగానే ఉంటుంది కదా. అసలే వెడ్డింగ్ టైమ్స్ కోసం కాబట్టి మోడరన్ బ్రైడ్ గా తయారయింది. సంప్రదాయవాదులకు ఈ మోడరన్ బ్రైడల్ వేర్ కాన్సెప్ట్ నచ్చకపోవచ్చు.. వారికి కియారాను చూస్తే బాపు బొమ్మలా కనపడక పోవచ్చు కానీ సోషల్ మీడియా సేవీ నెటిజన్లకు మాత్రం పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుంది.

ఈ మ్యాగజైన్ల పోజులేమో కానీ పలు సినిమాల ఆఫర్లతో కియారా చాలా బిజీగా ఉంది. కియారా 'అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు అక్షయ్ కుమార్ హీరోగా నటించే 'గుడ్ న్యూస్'.. 'లాక్ష్మి బాంబ్' సినిమాల్లో నటిస్తోంది.